Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Published : Sep 23, 2026, 04:53 PM IST

Kidney Stones: ప్రస్తుతం చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఆ నొప్పి భరించడం చాలా కష్టం. అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండాలి వంటివి ఇక్కడ తెలుసుకుందాం

PREV
15
కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి?

కిడ్నీలో ఉండే కొన్ని ఖనిజాలు, వ్యర్థ పదార్థాలు మూత్రంలో ఎక్కువగా పేరుకుపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా గట్టిగా మారుతాయి. ఇవి ఒకదానికొకటి అతుక్కొని రాళ్లుగా ఏర్పడతాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు తక్కువగా తాగడం, మూత్రంలో కొన్ని ఖనిజాల స్థాయి పెరగడం, ఉప్పు ఎక్కువగా తినడం, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, అధిక బరువు, కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా రాళ్లు ఉండటం లాంటివి ప్రధాన కారణాలు.

ఒకసారి కిడ్నీలో రాళ్లు వస్తే, మళ్లీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పైగా, కిడ్నీ రాళ్లన్నీ ఒకే రకంగా ఉండవు. కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్ రాళ్లు ఇలా చాలా రకాలు ఉంటాయి. అందుకే, ఇప్పటికే రాళ్లు వచ్చిన వాళ్లు.. అవి ఏ రకమైన రాళ్లో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం.

25
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

కిడ్నీలో రాళ్లను అడ్డుకోవడంలో నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మనం సరిపడా నీళ్లు తాగకపోతే మూత్రం చిక్కగా మారుతుంది. అప్పుడు రాయిని ఏర్పరిచే ఖనిజాలు ఎక్కువగా పేరుకుపోయి, అవి ఒకదానికొకటి అతుక్కుని స్ఫటికాలుగా మారే ప్రమాదం పెరుగుతుంది. శరీరానికి సరిపడా నీళ్లు తాగితే మూత్రం పలచబడుతుంది. రాయిని ఏర్పరిచే ఖనిజాలు కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు లేని వాళ్లు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

35
ఉప్పు తగ్గించడం

మనం తినే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో కాల్షియం బయటకు వెళ్లే పరిమాణం కూడా పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వంటల్లో ఉప్పు తగ్గించడమే కాకుండా.. ప్యాకెట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, సాస్‌లు లాంటివి కూడా తగ్గించడం మంచిది.

నాన్ వెజ్ మితంగా తినడం

చికెన్, మటన్, ఫిష్ వంటి ప్రొటీన్ ఫుడ్స్ ఎక్కువగా తింటే కొన్ని రకాల రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రొటీన్ పూర్తిగా తినకూడదని కాదు కానీ.. మితంగా తినడం మంచిది. అలాగే రోజూవారీ ఆహారంలో కూరగాయలు, పప్పు దినుసులు లాంటివి కూడా చేర్చుకోవడం ముఖ్యం.

45
పాలు, పాల పదార్థాలు

కాల్షియం రాళ్లు అనగానే పాలు, పెరుగు లాంటి కాల్షియం ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఆహారంలో సరైన మోతాదులో కాల్షియం ఉంటే, అది పేగుల్లోని ఆక్సలేట్ లాంటి పదార్థాలతో కలిసిపోయి.. అవి మూత్రంలోకి ఎక్కువగా వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.

55
బరువును అదుపులో ఉంచుకోవడం

కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదానికి, అధిక బరువుకు సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం, రోజువారీ ఆహారపు అలవాట్లను సరిగ్గా పాటించడం ముఖ్యం. దీనికోసం కఠినమైన డైట్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు తగ్గించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం, సరిపడా నీళ్లు తాగడం, కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం, ప్రొటీన్ ఫుడ్స్ మితంగా తీసుకోవడం లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.

Read more Photos on
click me!

Recommended Stories