Chicken vs Mutton: మనలో చాలామంది చికెన్, మటన్ ని ఇష్టంగా తింటారు. కానీ ఆరోగ్యపరంగా చికెన్ తింటే మంచిదా? మటన్ తింటే మంచిదా? ప్రోటీన్ కోసం ఈ రెండింటిలో ఏది బెస్ట్? వంటి డౌట్స్ చాలామందిలో ఉంటాయి. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
మన శరీరంలో కండరాలు, కణాలు, కణజాలాల పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యం. అందుకోసం చికెన్, మటన్ తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే చికెన్, మటన్ రెండింటిలోనూ మంచి ప్రోటీన్ దొరుకుతుంది. ముఖ్యంగా స్కిన్‌లెస్ చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అందుకే జిమ్‌కు వెళ్లేవాళ్లు, ప్రోటీన్ ఎక్కువ కావాలనుకునేవాళ్లు చికెన్ ని ఎక్కువగా తింటుంటారు.
26
ఫ్యాట్ దేనిలో తక్కువ?
చికెన్, మటన్‌ను పోల్చి చూస్తే.. మనం తీసుకునే మాంసం ముక్కను బట్టి అందులో ఫ్యాట్ ఉంటుంది. సాధారణంగా స్కిన్‌లెస్ చికెన్‌లో, ముఖ్యంగా బ్రెస్ట్ పీస్‌లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మటన్‌లో అయితే శాచురేటెడ్ ఫ్యాట్, కొవ్వు శాతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవాళ్లు మాంసం ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
36
మటన్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు
మటన్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇందులో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్, జింక్, విటమిన్ బి12 లాంటి పోషకాలకు మటన్ కేరాఫ్ అడ్రస్. రక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరుకు విటమిన్ బి12 చాలా అవసరం. అలాగే శరీరంలోని చాలా అవసరాలకు ఐరన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోషకాలు అందాలంటే మటన్ తీసుకోవడం మంచిది.
బరువు తగ్గాలనుకునేవాళ్లు తక్కువ కేలరీలు, తక్కువ ఫ్యాట్ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలాంటి వాళ్లకు స్కిన్‌లెస్ చికెన్ మంచి ఆప్షన్. అయితే చికెన్‌ను ఎలా వండుతున్నామనేది కూడా ఇక్కడ ముఖ్యం. నూనెలో డీప్ ఫ్రై చేసినా, క్రీమ్స్ ఎక్కువగా వాడినా అందులోని పోషకాలు పోయి ఫ్యాట్ పెరుగుతుంది.
56
వండే విధానం ముఖ్యం
చికెన్ తీసుకున్నా, మటన్ తీసుకున్నా.. దాన్ని వండే విధానం చాలా ముఖ్యం. నూనెలో డీప్ ఫ్రై చేసే బదులు ఉడకబెట్టడం, గ్రిల్ చేయడం లేదా తక్కువ నూనెతో వండుకోవడం మంచిది. మటన్ వండేటప్పుడు దానికి ఉన్న కొవ్వును తీసేయాలి. చికెన్ వండేటప్పుడు చర్మం తీసేస్తే ఫ్యాట్ శరీరంలోకి చేరకుండా ఉంటుంది.
66
ఎవరికి ఏది బెస్ట్?
చికెన్, మటన్.. ఈ రెండింటికీ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునేవాళ్లు స్కిన్‌లెస్ చికెన్ ఎంచుకోవచ్చు. ఐరన్, జింక్, బి12 కావాలనుకునేవాళ్లు మటన్ తినొచ్చు. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ మితంగా తినడం ఉత్తమం. వీటితో పాటు కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు కూడా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.