2023 లో బాగా ట్రెండ్ అయిన లేడీస్ డ్రెస్ లు ఇవే..!

First Published | Dec 13, 2023, 1:01 PM IST

ఆడవాళ్లు అందంగా, డిగ్నిటీగా కనిపించడానికి బట్టల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. కలర్, క్లాత్ నచ్చితే చాలు కొనేస్తారు. అయితే 2023 లో ఆడవాళ్లకు బాగా నచ్చిన టాప్ 10 దుస్తులేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

Women's Dressing

ఒకప్పటికీ.. ఇప్పటికీ దుస్తుల విషయంలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రస్తుతం ఆడవాళ్లైనా, మగవారైనా.. ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. జీన్స్ నుంచి స్కర్ట్ వరకు.. కంఫర్ట్ గా ఉండే వాటినే ఎక్కువగా కొంటున్నారు. ప్రతి ఇయర్ కొత్త కొత్త డిజైన్ దుస్తులు మార్కెట్ లోకి వస్తూనే ఉంటాయి. కానీ వీటిలో కొన్ని మాత్రమే బాగా ట్రెండ్ అవుతాయి. 
 

Women's Dressing

ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా ముఖ్యం.  ఎందుకంటే మన వేశాధారణ తోనే అవతలి వ్యక్తి మన గురించి ఒక అంచనాకు వస్తాడు. చాలా మంది కొత్త వారిని కలిసినప్పుడు వితిన్ సెకన్లలోనే మన గురించి చెప్పేస్తుంటారు. ఇతరులను కూడా మనం అలాగే అంచనా వేస్తాం. అందుకే మహిళలు స్టైలిష్, ట్రెండింగ్ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. అంతేకాకుండా వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే గొప్ప దుస్తులు కూడా వారి రూపాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఏదేమైనా దుస్తులను బట్టి మనుషులను అంచనా వేయడం సరికాదంటారు కొందరు. ఈ సంగతి పక్కన పెడితే ఆడవాళ్లకు 2023 లో బాగా నచ్చిన, బాగా ట్రెండ్ అయిన లేడీస్ వేర్ ఏంటో తెలుసుకుందాం పదండి. 
 

Latest Videos


బ్యాగీ జీన్స్

1. బ్యాగీ జీన్స్

బ్యాగీ జీన్స్ కూడా 2023 లో బాగా ట్రెండ్ అయ్యింది. ఈ బ్యాగీ జీన్స్  కంఫర్ట్ గా ఉండటమే కాకుండా స్టైల్ గా కూడా కనిపిస్తారు. అందుకే 2023 ఆడవాళ్లు ఈ ట్రెండ్ కు ఫిదా అయ్యారు. ఒకప్పుడు స్కిన్-టైట్ జీన్స్ లనే ఎక్కువగా వేసుకునేవారు. ఇవి స్టైలీష్ గా కనిపించినా.. అంత కంఫర్ట్ గా అనిపించవు. అందుకే ఈ ఏడాది ఆడవాళ్లు బ్యాగీ జీన్స్ ను బాగా ధరించారు. క్యాజువల్ ట్రెండింగ్ దుస్తులను వేసుకోవాలనుకుంటే బ్యాగీ డెనిమ్ ను ట్రై చేయండి. ఇది మీ లుక్ ను క్యాజువల్ గా, రిలాక్స్ గా ఉంచుతుంది. 
 

Sheer tops

2. షీర్ టాప్స్ 

2023 లో బాగా ట్రెండ్ అయిన ఉమెన్ వేర్ లో షీర్ టాప్స్ ఒకటి. ఈ కొత్త ట్రెండ్ ఫ్యాషన్ ను ప్రపంచ వ్యాప్తంగా ఫాలో అయ్యారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ ఫ్యాషన్ వేర్ లో మెరిసారు. ఆలియా భట్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా వంటి సెలబ్రిటీలు కూడా షీర్ టాప్స్ ను ధరించారు. స్టైలిష్ అండ్ సెన్సిబుల్ లుక్ ను ఇస్తుంది ఈ షీర్ టాప్స్. జీన్స్, షూస్ లో మీరు క్యాజువల్ లుక్ లో కనిపిస్తారు. లేదా ఈ షీర్ టాప్స్ పైకి పెన్సిల్ స్కర్ట్, హీల్స్ ను కూడా వాడొచ్చు. 

A-line dress

3. ఎ-లైన్ డ్రెస్ 

ఎ-లైన్ డ్రెస్ కు అది రూపొందించే ఎ-ఆకారంలో ఉన్న సిల్హౌట్ నుంచే ఈ పేరు వచ్చింది. ఈ ట్రెండింగ్ పార్టీ-వేర్ అంటే ఆడవాళ్లకు చాలా చాలా ఇష్టం. ముఖ్యంగా పియర్ ఆకారంలో ఉన్న శరీరాలు ఉన్నవారికి ఇవి బాగా నప్పుతాయి. ఎందుకంటే ఇది వాళ్లను అందంగా కనిపించేలా చేస్తుంది. ఆఫీస్ కు లేదా కాక్టెయిల్ పార్టీకి ఎ-లైన్ డ్రెస్ లు బెస్ట్. 

పెన్సిల్ స్కర్ట్

4. పెన్సిల్ స్కర్ట్ 

పెన్సిల్ స్కర్టులను కూడా ఆడవారు బాగా ఇష్టపడతారు. ఆఫీసుకు ఈ దుస్తులను వేసుకెళ్లాలంటే.. టైలర్డ్ బ్లౌజ్, హీల్స్ కాంబినేషన్ అదిరిపోతుంది. మరింత అందంగా కనిపించాలంటే క్రాప్డ్ జాకెట్ లేదా స్టేట్మెంట్ బ్లేజర్ ను కూడా వేసుకోవచ్చు. లుక్ ను ఎలివేట్ చేయడానికి బెల్టులు, నగలు, బ్యాగులను కూడా ధరించండి. 
 

Flare dresses

5. ఫ్లేర్ దుస్తులు

ఈ 2023 లో ఆడవాళ్లకు బాగా నచ్చిన డ్రెసెస్ లో ఫ్లేర్ డ్రెస్ లు ఒకటి. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవి మీరు ఫిట్, బ్యూటీఫుల్ గా కనిపించేలా చేస్తాయి. ఇవి వదులుగా ఉంటూనే, ఫిట్నెస్ గా కనిపించేలా చేసత్ాయి. ఆడవాళ్లు వీటిని ఎక్కువగా ఇష్టపడటానికి ప్రధాన కారణం.. సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉండటమే. బొద్దుగా ఉన్న ఆడవారికి ఇవి బాగా నప్పుతాయి. అందుకే ఇలాంటి వాటిని ఎక్కువగా ట్రై చేస్తుంటారు. 

Wrap Tops

6. Wrap Tops లు

ప్రస్తుతం ఉమెన్స్  Wrap Tops కూడా జోరందుకున్నాయి. ఈ టాప్ లు చాలా కంఫర్టబుల్ గా, స్టైలిష్ గా ఉంటాయి. అందుకే ఈ ఏడాదిలో ఆడవాళ్లు వీటిని తెగ కొనేశారట. లో-నెక్ ర్యాప్ టాప్స్ నుంచి లాంగ్ ర్యాప్-ఓవర్ టాప్స్ వరకు ఆడవాళ్లకు ఇవి తెగ నచ్చేశాయి. ప్రతి డిజైన్ దాని ప్రత్యేకమైన ఆకర్షణను తెస్తుంది. ఇవి ఆడవాళ్లలో విశ్వాసాన్ని పెంచుతాయి. 

Maxi dress fashion

7. మ్యాక్సీ డ్రెస్సులు 

మ్యాక్సీ దుస్తులు కూడా ఈ ఏడాది ట్రెండింగ్ లో ఉన్నాయి. రకరకాల డిజైన్స్, ప్రింట్లలో ఈ డ్రెస్ లు ఉంటాయి. మాక్సీ డ్రెస్సులు కూడా మిమ్మల్ని మరింత సౌకర్యవంతంగా ఉంచుతాయి. అందుకేనేమో ఈ ఏడాది ఆడవాళ్లు ఈ డ్రెస్సులను కూడా ఇష్టంగా ధరించారు. సమ్మర్ పార్టీకి వెళితే స్టైలిష్ మ్యాక్సీ దుస్తులను ఎంచుకోండి. 
 

Floral Print

8. ఫ్లోరల్ ప్రింట్ మిడి 

2023 లో బాగా ట్రెండ్ అయిన దుస్తుల్లో ఫ్లోరల్ ప్రింట్ మిడీలు కూడా ఉన్నాయి. ఆఫీసు నుంచి బ్రంచ్ కు మార్చే మహిళలకు ఇవి బాగా సరిపోతాయి. ఈ ట్రెండీ వేర్ మిమ్మల్ని కంఫర్ట్ గా ఉంచడమే కాకుండా మీరు స్టైలీష్ గా కనిపించేలా కూడా చేస్తాయి. వీటిని ఆఫీసుకు కూడా వేసుకెళ్లొచ్చు. ఫ్లోరల్ మిడిని ట్రెండీ స్నీకర్స్ తో ధరించే మీ లుక్ క్యాజువల్ గా, కంఫర్ట్ గా ఉంటుంది. 
 

Jump suit

9. జంప్ సూట్ లు 

జంప్ సూట్లు కూడా 2023 లో ఫ్యాషన్ రంగాన్ని ఏలాయి. ఈ స్టైలిష్ దుస్తులు కూడా ఆడవాళ్లను తెగ ఆకర్షించాయి. ఎలాంటి శరీరం ఉన్నా.. ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వీటిని ఫ్యాన్సీ నైట్ కోసం వేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇవి మీ లుక్ క్యాజువల్ గా కనిపించేలా చేస్తాయి. 
 

10. కో-ఆర్డ్ సెట్ లు 

కో-ఆర్డ్ సెట్లు కూడా ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు.. వీటిని ఈ ఏడాదిలో బాగా ధరించారు. నిజానికి ఇవి ఇప్పుడిప్పుడే వచ్చిన డ్రెస్ లు కావు. ఏండ్ల నుంచి ఉన్నాయి. కానీ సరికొత్తగా డిజైన్ అవుతూ వచ్చాయి. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చాలా మంది వీటినే బాగా ఇష్టపడుతున్నారు. సాధారణ విహారయాత్రల నుంచి అధికారిక ఈవెంట్ల వరకు వీటిని వేసుకెళ్లొచ్చు. వీటిలో మీరు ఫ్యాషన్ గా, స్టైలీష్ గా కనిప్తాయి. 
 

click me!