Today Horoscope: ఓ రాశివారి పలుకుబడి పెరుగుతుంది

Published : May 17, 2024, 05:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..  

PREV
112
Today Horoscope: ఓ రాశివారి పలుకుబడి పెరుగుతుంది
telugu astrology


17-5-2024,  వారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)


మేషం (అశ్విని ,భరణి , కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
భరణి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
కృత్తిక నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు)

దిన ఫలం:-అధికారులు తో సఖ్యత పెరుగుతుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలరు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.శుభకార్య విషయాలు ను చర్చిస్తారు. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు.బంధు వర్గము వారిచే గౌరవించ బడతారు.తలపెట్టిన వ్యవహారములు సానుకూలంగా జరుగును.ఆర్థిక సహాయ సహకారాలు పొందగలరు.ఓం శంకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

212
telugu astrology

వృషభం(కృత్తిక 2 3 4, రోహిణి, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)

దిన ఫలం:-ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి.శ్రమ అధికమైనా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలించును.నూతన ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి.రావలసిన బాకీలు వసూలు అవును.నూతన పరిచయాలు తో పనులు పూర్తి అగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఓం సద్గురు సాయినాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

మిథునం(మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాదిపతి శుక్రుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాదిపతి రాహు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి.ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది.పలుకుబడి పెరుగుతుంది.విద్యార్థులు ప్రతిభా కనబరుస్తారు.ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలం.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రులతో కలిసి సత్కాలక్షేపం చేస్తారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

412
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి రవి)
ఆశ్రేష నక్షత్రం వారికి  (దినాధిపతి కుజుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో  ఇబ్బందులు ను అధిగమిస్తారు. ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రుణ సమస్యలు పెరగవచ్చు.వ్యవహారములలో ఓర్పు వహించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడగలవు. కలహాలకు దూరంగా ఉండండి.ఆరోగ్యముపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి.బంధువర్గము తో విభేదాలు వచ్చే అవకాశం.అనవసరమైన ఖర్చులు చేస్తారు.మానసిక ఆందోళనకు గురవుతారు. ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

512
telugu astrology

సింహం (మఖ , పుబ్బ, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )

దిన ఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.పెద్దల సహకారం లభిస్తుంది. సన్నిహితుల సహాయ సహకారాలు పొందగలరు.పాత బాకీలు వసూలు అవుతాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందగలరు.ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పొందగలరు.ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

612
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)
చిత్త నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)

దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన నిర్ణయాలు తీసుకుంటారు.ఆలోచనలు ఆచరణలో పెడతారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలం.కీలకమైన సమస్య విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.చిన్ననాటి మిత్రులు తో కలిసి ఆనందంగా గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో శుభకార్యం ఆలోచనలు చేస్తారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగులకు అనుకూలం.మానసిక ప్రశాంతత పొందగలరు.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు. కొంతకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవును.ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

812
telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి రవి)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)

దిన ఫలం:-బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.మానసిక ఆందోళన అధికమవుతుంది.అనారోగ్య సమస్యలు రావచ్చు.అకారణంగా నిందలు అపకీర్తి రాగలవు.స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టడం.సహోద్యోగులతో విభేదాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.దివాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

912
telugu astrology


ధనుస్సు (మూల ,పూ.షాఢ , ఉ.షాఢ)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి శని)
ఉ.షాఢ నక్షత్రం వారికి (ధినాధిపతి కేతువు )

దిన ఫలం:-ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి కాగలవు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. నూతన పనులకు శ్రీకారం చేస్తారు.గృహ సంబంధిత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహారంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహాన్ని పొందగలరు.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు.సామాజిక సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1012
telugu astrology

మకరము(ఉ.షాఢ 2 3 4, శ్రవణం, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాదిపతి బుధుడు)

దిన ఫలం:-చేపట్టిన పనులు లో సమస్యలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరమైన సమయానికి ధనం చేతికి అందుతుంది. బంధువులతో విభేదాలు కలగవచ్చు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహరాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.శారీరకంగా మానసికంగా బలహీనతగా ఉంటుంది.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగలవు. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1112
telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాదిపతి శుక్రుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాదిపతి రాహు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.మిత్రులతో సఖ్యత గా ఉండాలి.తలచిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు రావచ్చు.శారీరక శ్రమ. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన మానసిక ఆందోళన కలిగిస్తుంది.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు పాటించ వలెను.అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1212
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి రవి)
రేవతి నక్షత్రం వారికి (దినాదిపతి కుజుడు)

దిన ఫలం:-ఇంటాబయటా ప్రతికూలత వాతావరణ.కీలకమైన సమస్య యందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి.అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.బంధువులతో వివాదాలు.ఆరోగ్యపరంగా చికాకులు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులు తో కలహలు ఏర్పడవచ్చు.వాహన ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


 

Read more Photos on
click me!

Recommended Stories