ప్రతి తండ్రి.. కొడుక్కి నేర్పించాల్సిన విషయాలు ఇవి..!

First Published | Nov 3, 2021, 10:28 AM IST

ప్రతి తండ్రి.. తమ కుమారుడికి.. బాధ్యతలు తీసుకోవడం నేర్పించాలట. పరిస్థితి ఎలాంటిదైనా.. బాధ్యత తీసుకునేలా నేర్పించాలట. దాని ప్రాముఖ్యతను వారు తమ కుమారులకు వివరించాలట

పిల్లల జీవితంలో.. వారి తల్లిదండ్రుల పాత్ర కచ్చితంగా ఉంటుంది. పిల్లలు ఎలా పెరుగుతున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు.. అనే విషయం.. వారి తల్లింద్రుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక మగ పిల్లలపై వారి తండ్రి ప్రవర్తన వారిపై పడుతుంది. వారు మంచైనా, చెడైనా ముందు.. తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారట. అందుకే.. పిల్లలు సరైన మార్గంలో వెళ్లాలి అంటే.. ముందు మనం కూడా మంచిగా ఉండాలని చెబుతుంటారు.

ముఖ్యంగా తండ్రి ప్రవర్తన.. కొడుకులపై.. తల్లి ప్రవర్తన.. కూతుళ్లపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా విషయాలు వారు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారట. కాబట్టి.. ప్రతి తండ్రి.. తమ కొడుకులకు కొన్ని విషయాలను నేర్పించాలని.. అవి వారు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

Latest Videos


ప్రతి తండ్రి.. తమ కుమారుడికి.. బాధ్యతలు తీసుకోవడం నేర్పించాలట. పరిస్థితి ఎలాంటిదైనా.. బాధ్యత తీసుకునేలా నేర్పించాలట. దాని ప్రాముఖ్యతను వారు తమ కుమారులకు వివరించాలట. చేసిన తప్పులను అంగీకరించడం.. పరిస్థితులను ఎదుర్కోవడం కూడా నేర్పించాలట.

చాలా మంది పిల్లలు.. తమ మనసులోని మాటలను బయటకు చెప్పలేక బాధపడుతూ ఉంటారట. అలాంటి పరిస్థితి తమ కుమారుడికి రాకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిపైనే ఉంటుందట. వారి మనసులోని ఫీలింగ్స్ బయటకు చెప్పే ఫ్రీడమ్ వారికి ఇవ్వాలి. ఇక మగ పిల్లలు ఏడుస్తుంటే..చాలా మంది ఎందుకు ఆడపిల్లలా ఎడుస్తున్నావ్ అంటారు. కానీ నిజానికి .. అలా వారిని ఏడ్వకుండా ఆపకూడదట. మగ పిల్లకు కూడా బాధ వచ్చినప్పుడు ఏడ్చే స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే వారికి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి.. మగ పిల్లలు ఏడ్వకూడదు.. ఫీలింగ్స్, బాధ బయటపెట్టకూడదు అనే మాటలు వారిని చెప్పకూడదు.

జీవితంలో గెలుపు, ఓటములు చాలా సహజం. గెలిస్తే.. ఆనందపడటం.. ఓడిపోతే బాధపడటం కూడా సహజం. అయితే... ఓడిపోయిన ప్రతిసారి బాధపడి.. మరోసారి ప్రయత్నించకుండా ఉండిపోతారు చాలా మంది. అయితే.. ఈ విషయంలో పిల్లలకు వారి తండ్రి అండగా ఉండాలి. చిన్నతనంలోనే.. ఓడిపోతే మరోసారి ప్రయత్నించమని.. ఓటమితో జీవితం ముగియదని..  కలలను నిజం చేసుకునేందుకు పోరాడాలని నేర్పించాలి.

చాలా మంది పిల్లలు.. చాలా వైలెంట్ గా ఉంటారు. చిన్న విషయాలకే విపరీతమైన కోపం తెచ్చుకుంటారు. కాబట్టి.. పిల్లలకు యాంగర్ మేనేజ్మెంట్ గురించి నేర్పించాలి. గొడవలు పడటం, కోపం తెచ్చుకోవడం లాంటివి విషయాలను కంట్రోల్ ఎలా  చేసుకోవాలనే విషయాలను కూడా నేర్పించాలట.

చాలా మంది పిల్లలు.. చాలా వైలెంట్ గా ఉంటారు. చిన్న విషయాలకే విపరీతమైన కోపం తెచ్చుకుంటారు. కాబట్టి.. పిల్లలకు యాంగర్ మేనేజ్మెంట్ గురించి నేర్పించాలి. గొడవలు పడటం, కోపం తెచ్చుకోవడం లాంటివి విషయాలను కంట్రోల్ ఎలా  చేసుకోవాలనే విషయాలను కూడా నేర్పించాలట.

ఆడపిల్లలను గౌరవించడం చాలా మంచి అలవాటు. ఈ విషయాన్ని కూడా.. తండ్రులు.. తమ మగ పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పిచంాలి. ఇంట్లో తల్లిని ఎలా మర్యాదగా చూసుకుంటామో.. బయటవారిని కూడా అంతే మర్యాదగా చూడాలి. ఈ విషయాన్ని వారికి చిన్నతనం నుంచే నేర్పించాలి.


జెంటిల్మెన్ గా ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా వారికి నేర్పించాలి. ప్రాపర్ హ్యాండ్ షేక్ ఎలా చేయాలి..? ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎదుటివారిని ఎలా గౌరవించాలి అనే విషయాలను చిన్నతనం నుంచే నేర్పించాలి.

click me!