Shiny skin: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ ఆహారాలను తీసుకోండి..

First Published Jan 29, 2022, 2:01 PM IST

Shiny skin: చర్మం తలతల మెరిసిపోవాలన్నా.. కాంతివంతంగా మారాలన్నా.. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కంటే సహజసిద్దంగా లభించే ఆహార పదార్థాలే బాగా ఉపయోగపడతాయి. అలాంటి ఫుడ్ తీసుకుంటే అందరిలో మీరే అందంగా కాంతివంతంగా కనిపిస్తారు తెలుసా..

Shiny skin: మనం తీసుకునే ఆహారమే మన స్కిన్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. మీకు తెలుసా.. కొన్ని రకాల ఆహారాల పదార్థాలు మన చర్మం మెరిసిపోయేలా చేస్తాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, పోషకవిలువలు బాగా అందితే ఆటోమెటిక్ గా చర్మం నిగ నిగా మెరిసిపోతుంది. అంతేకాదు ఎప్పుడూ ఫ్రెష్ గా కనిపిస్తారు. అలాగే నిత్య యవ్వనంగా ఉండాలన్నా మంచి పోషకవిలువలున్న ఆహారం తీసుకోవాలి. అంతేకానీ ఎప్పుడూ ప్రాసెస్ చేసి ఆహారం, పీచుపదార్థాలు లేని food తీసుకుంటే చర్మం జీవం కోల్పోయినట్టు, డ్రై గా కనిపిస్తుంది. అంతేకాదు వీటివల్ల మొటిమలు, పొడిబారడం, Black circles కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే చర్మం ఎటువంటి సమస్యలకు గురికాకూడదన్నా, మెరిసిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తింటే నిత్య యవ్వనంగా ఉండటమే కాదు చర్మం నిగారిస్తుంది. అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


అవకాడో:  అవకాడో చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 9, పాలీ అన్ శాచురేటెర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాదు ఈ అవకాడో లో ఉండే విటమిన్ ఇ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కాగా అవకాడో వల్ల చర్మంపైం ఉండే  Epidural layer హైడ్రేట్ గా ఉంటుంది. అందుకే దీన్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. 

బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్ కూడా చర్మ నిగారింపుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ ఉండటం వల్ల Blood circulation బాగా జరుగుతుంది. అంతేకాదు ఇందులో ఉండే ఆంథోసైనిన్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల చర్మం ముడతలు పడదు. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. 
 

టొమాటో:  టొమాటోలు చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మొటమలు రావడానికి కారకమయ్యే బ్యాక్టీరియాను అదుపులో ఉంచుతుంది. అంతేకాదు టొమాటోలను తరచుగా తింటూ ఉంటే చర్మం మెరిసిపోతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే ఫ్రీ రాడికల్సల్ తో పోరాడి చర్మం అందంగా తయారయ్యేలా చేస్తాయి. 
 

కలబంద:  కలబందలో విటమిన్లు, ఎంజైములు, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫమేటరీ లు మెండుగా లభిస్తాయి. ఈ కలబంద గుజ్జు చర్మానికి మాయిశ్చరైజింగ్ లా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ కలబంద చర్మం నిగారింపుగా, పొడిబారకుండా ఉండేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం కలబంద రసంలో కొబ్బరి నీళ్లు మిక్స్ చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది నిపుణులు చెబుతున్నారు.


మునగ: మునగలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయగలదు. అందుకే ముగనతో చేసిన ఏ వంటకమైనా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. చిలగడదుంపలు, నిమ్మ, పసుపు వంటి ఆహారాలు కూడా చర్మ నిగారింపుకు ఎంతో ఉపయోగపడతాయి. 
 

click me!