చేపలు – 750 గ్రాములు, ఉప్పు – తగినంత, పసుపు – 1/4 టీస్పూన్, నల్ల మిరియాలు – 1 టేబుల్‌స్పూన్, 10 మెంతులు తాళింపు కోసం, ఉల్లిపాయ – 1, పచ్చిమిరపకాయలు – 3, వెల్లుల్లి రెబ్బలు – 15, టమాటాలు – 3, నూనె – సుమారు ⅔ కప్పు, ఆవాలు– 1/2 టీస్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – 2 టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి – 2 టేబుల్‌స్పూన్లు, చింతపండు – 50 గ్రాములు, కొబ్బరి పాలు – 2 కప్పులు, కొత్తిమీర – కొద్దిగా
పులుసు మసాలా కోసం.. మెంతులు – కాసింత సోంపు – 1/4 టీస్పూన్ జీలకర్ర – 1 టీస్పూన్ ఎండు మిరపకాయలు – 3–4. ఇప్పుడు ఒక పాన్‌లో మెంతులు, సోంపు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి మీడియం మంటపై వేయించాలి. మంచి వాసన వచ్చి మసాలాలు చిటపటలాడిన తర్వాత దించుకుని చల్లార్చాలి. వీటిని మెత్తని పొడిగా చేసుకుని పక్కన పెట్టాలి.
తయారీ విధానం
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి వాటికి ఉప్పు, 1/4 టీస్పూన్ పసుపు పట్టించాలి. 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి నల్ల మిరియాలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఉల్లిపాయలు వేగాక టమాటాలు కూడా వేసి వేయించాలి. దీన్ని చల్లార్చి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.