Snake: పాములు పుట్టల్లో లేదంటే.. బొరియల్లో ఉంటాయని మనకు తెలుసు. కానీ, తన కోసం, తన పిల్లల కోసం.. ఏకంగా తన ఇంటిని నిర్మించుకునే పాము ఒకటి ఉందని మీకు తెలుసా? ప్రపంచంలో తన ఇంటిని నిర్మించుకునే ఏకైక పాము కూడా ఇదే.
మనకు ఎక్కడైనా పుట్ట కనిపిస్తే చాలు... అక్కడ పాము ఉందేమో అని భయపడిపోతాం. దాదాపు పాములన్నీ.. పుట్టల్లోనూ, బొరియల్లోనూ దాక్కుంటాయి. ఈ సృష్టిలో చాలా జంతువులు, పక్షులు.. తమ సొంత ఇంటిని అవే నిర్మించుకుంటాయి. కానీ, పాముులు అలా చేయవు. వేరే జంతువులు తయారు చేసిన బొరియల్లో, చీమలు పెట్టిన పుట్టల్లో లేదంటే... ప్రకృతి సహజంగా ఏర్పడిన రంధ్రాలలో నివసిస్తూ ఉంటాయి. గుడ్లు పెట్టే సమయంలో కూడా చాలా వరకు సురక్షితమైన రంధ్రాలు, ఆకుల కుప్పలు, చెట్ల కింద ఉండే ప్రదేశాలను ఎంచుకుంటాయి.
23
గూడు ఎలా కడుతుంది?
కానీ, ఈ పాములన్నింటికీ భిన్నంగా మరో పాము ఉంది. అదే కింగ్ కోబ్రా. ఇది.. వేరే జంతువులు ఏర్పరిచిన పుట్టల్లో, బొరియల్లో అది ఉండదు. దానికంటూ అదే స్పెషల్ గా గూడు నిర్మించుకుంటుంది. తన కోసం కాదు.. తన పిల్లల కోసం ఆలోచించి ఈ గూడు కడుతుంది. ఈ కింగ్ కోబ్రా గుడ్లు పెట్టే సమయంలో... ఓ పక్షిలా ప్రవర్తిస్తుంది. పక్షులు తమ సొంతంగా తామే ఆకులు, కొమ్మలు తెచ్చి గూడు కట్టుకున్నట్లు... ఈ పాము కూడా. .. పక్షి మాదిరి ఆకులు, కొమ్మలతో గూడు కడుతుంది. ఇది చూడటానికి పక్షి గూడులా ఉండకపోవచ్చు. కానీ.. దానికి గుడ్లు పెట్టడానికి అనుగుణంగా ఏర్పరుచుకుంటుంది. పక్షులకు అయితే.. ముక్కు ఉంటుంది.. దానితో కొమ్మలు, ఆకులు తెచ్చుకుంటాయి. కానీ, పాముకి అలా ఉండదు. అయినా కూడా తన శరీరం, తోకను ఉపయోగించి.. ఎండిపోయిన ఆకులు, కొమ్మలను ఒక్కొటిగా ఒక చోటికి లాక్కొని క్రమంగా ఒక కుప్పలా మార్చి గూడు తయారు చేస్తుంది. ఈ గూడు మధ్యలో గుడ్లు పెట్టేందుకు ఒక ప్రత్యేకమైన గది లాంటి భాగాన్ని ఏర్పాటు చేస్తుంది. తన గుడ్లు సురక్షితంగా ఉండేలా ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని తయారు చేస్తుంది.
33
కింగ్ కోబ్రా ఈ గూడు ఎందుకు కట్టుకుంటుంది?
ఈ పాము గూడు కట్టడానికి ప్రధాన కారణం.. తన గుడ్లను రక్షించుకోవడం. మరో కారణం సరైన ఉష్ణోగ్రత. పాము గుడ్లను బయట వదిలేస్తే అవి ఇతర జంతువులకు ఆహారంగా మారే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. గుడ్లు అభివృద్ధి చెందడానికి సరైన ఉష్ణోగ్రత కూడా అవసరం. కింగ్ కోబ్రా తయారు చేసే ఆకుల గూడు గుడ్లకు ప్రత్యేకమైన సూక్ష్మ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఆకులు కుళ్లిపోయే సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కూడా గూడు లోపలి ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
భారతదేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో 25 కింగ్ కోబ్రా గూళ్లను పరిశీలించిన పరిశోధనలో.. గూడు లోపలి ఉష్ణోగ్రత బయట వాతావరణం కంటే సగటున సుమారు 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రత కారణంగా గుడ్లు మంచిగా పొదుగుతాయి. కింగ్ కోబ్రా ప్రత్యేకత ఇక్కడితో ఆగదు. ఆడ పాము గుడ్లు పెట్టిన తర్వాత వాటిని కాపాడేందుకు గూడు దగ్గరే ఉంటుంది. గుడ్లను రక్షించే సమయంలో ఇది మరింత అప్రమత్తంగా మారుతుంది. ఈ పాము తాను పెట్టిన గూడులో 21 నుంచి దాదాపు 40 వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగే వరకు తల్లి పాము గూడు దగ్గర ఉండి వాటిని కాపాడుతుంది. ఇది కేవలం తన పిల్లల కోసమే ఈ గూడు ఏర్పాటు చేయడం విశేషం.