Hair Growth: పొడవాటి, ఆరోగ్యమైన జుట్టు కోసం చాలామంది రెగ్యులర్‌గా హెయిర్ ట్రిమ్ చేయిస్తుంటారు. జుట్టు చివర్లను కట్ చేస్తే వేగంగా పెరుగుతుందని చెప్తారు. కానీ ఇందులో నిజమెంత? అసలు ఎన్నిరోజులకు ఒకసారి జుట్టును ట్రిమ్ చేయాలి?
పొడవాటి, ఆరోగ్యమైన జుట్టు కోసం చాలామంది రెగ్యులర్‌గా హెయిర్ ట్రిమ్ చేయిస్తుంటారు. జుట్టు చివర్లను కట్ చేస్తే వేగంగా పెరుగుతుందని చెప్తారు. కానీ ఇందులో నిజమెంత? నిజానికి జుట్టును కట్ చేయడం వల్ల పెరగదు. జుట్టు స్కాల్ప్ కింద ఉన్న హెయిర్ ఫోలికల్స్ నుంచి పెరుగుతుంది. కాబట్టి చివర్లను కత్తిరించడం వల్ల జుట్టు పెరగదు. అయితే కత్తిరించడం వల్ల జుట్టు చివర్లలో చిట్లిపోవడం, విరగడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. దీంతో జుట్టు ఆరోగ్యంగా, నీట్‌గా కనిపిస్తుంది.
24
ఎన్నిరోజులకు ఒకసారి ట్రిమ్ చేయాలి?
అందరికీ ఒకే టైమ్ గ్యాప్ సరిపోదు. జుట్టు రకం, పొడవు, స్టైలింగ్ అలవాట్లు, కలరింగ్ లేదా కెమికల్ ట్రీట్‌మెంట్స్ బట్టి గ్యాప్ మారుతుంది. జుట్టును పెంచుకోవాలనుకునేవారు 8 నుంచి 12 వారాలకు ఒకసారి ట్రిమ్ చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్న జుట్టుకు 10 నుంచి 12 వారాల గ్యాప్ సరిపోవచ్చు. హెయిర్ స్ట్రెయిటెనింగ్, కర్లింగ్ ఐరన్స్, బ్లీచింగ్, కలరింగ్ చేసేవారిలో డ్యామేజ్ ఎక్కువగా ఉండొచ్చు. అలాంటివారు 6 నుంచి 8 వారాలకు ఒకసారి ట్రిమ్ చేయడం గురించి ఆలోచించవచ్చు. చిట్లిపోయి, పొడిబారి లేదా బలహీనంగా కనిపిస్తే ట్రిమ్ చేయడం మంచిది.
34
ట్రిమ్ చేస్తే జుట్టు ఎందుకు ఆరోగ్యంగా కనిపిస్తుంది?
జుట్టు చివర్లనేవి దువ్వడం, ఎండ, హీట్ స్టైలింగ్, కలరింగ్ ప్రభావంతో అవి దెబ్బతింటాయి. దీంతో స్ప్లిట్, బ్రేకేజ్ మొదలవుతాయి. దెబ్బతిన్న చివర్లను కట్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా కనిపించి పొడవుగా పెరిగేలా చేస్తుంది.
జుట్టు పొడవుగా పెంచుకోవాలంటే ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా కట్ చేయాలనే రూల్ ఏమీ లేదు. సాధారణంగా 10 నుంచి 12 వారాలకు ఒకసారి ట్రిమ్ చేయడం ఓ గైడ్‌లైన్‌గా పెట్టుకోవచ్చు. మీ జుట్టు చివర్లు ఆరోగ్యంగా ఇంకాస్త లేటుగా కట్ చేసుకోవచ్చు. స్ప్లిట్, బ్రేకేజ్ కనిపిస్తే ట్రిమ్ చేయడం మంచిది. గుర్తుంచుకోండి...హెయిర్ కట్ చేయడం వల్ల జుట్టు పెరగదు. పొడవును కాపాడుకోవడంలో సహాయపడుతుంది.