చలికాలంలో దీర్ఘకాలిక కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్ ఫుడ్స్..

First Published Dec 5, 2022, 4:25 PM IST

కొన్ని రకాల ఆహారాలు మంట, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంతేకాదండోయ్ ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

చలికాలం కీళ్ల నొప్పులను కారణం కానప్పటికీ.. జలుబు ఇతర సమస్యల వల్ల ఈ నొప్పులు మాత్రం బాగా పెరుగుతాయి. చలికాలంలో కీళ్ల చుట్టూ రక్తనాళాలు గట్టిపడతాయి. దీంతో ఆర్థరైటిస్ సమస్య ఎక్కువ అవుతుంది. అయితే ఈ నొప్పులను కొన్ని చిట్కాల ద్వారా సులువుగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. వీటివల్ల మంట, ఆర్థరైటివ్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గుతాయి. చలికాలంలో దీర్ఘకాలిక నొప్పులను తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పచ్చి పసుపు

పసుపును భారతీయ వంటల్లో ఖచ్చితంగా వేస్తారు. దీనిలో ఎన్నో  ఔషదగుణాలుంటాయి. అందుకే ఆయుర్వేదంలో ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. పసుపులో కర్కుమిన్ అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం శరీరంలో మంటను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. అంతేకాదు కీళ్ల నొప్పుల నుంచి ఉపశనం కలిగిస్తుంది. పుసుపు ఆరోగ్య ప్రయోజనాల కోసమే కాదు.. చర్మ సమస్యలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు.
 

వెల్లుల్లి

 వెల్లుల్లిలో డయల్ డైసల్ఫైడ్ ఉంటుంది. ఇది శోథ నిరోధక సమ్మేళనం. ఇది ప్రో-ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల ప్రభావాలను పరిమితం చేస్తుంది. వెల్లుల్లి మంటతో పోరాడటానికి  మీకు సహాయపడుతుంది. అంతేకాదు వెల్లుల్లి బరువు తగ్గేందుకు, ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. 
 

అల్లం

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే అల్లాన్ని ఆయుర్వేద ఔషదాల్లో ఉపయోగిస్తారు. నిజానికి అల్లం శరీరంలో మంటను పుట్టించే పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. అల్లం దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

వాల్ నట్స్

వాల్ నట్స్  పోషకాలకు మంచి వనరులు. వాల్ నట్స్ లో కీళ్ల నొప్పులను, మంటను తగ్గించడానికి సహాయపడే సహాయపడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లో ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయని తేలింది.
 

చెర్రీలు

చెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది కీళ్ళు, కండరాలలో వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. చెర్రీలకు ఎరుపు రంగును ఆంథోసైనిన్స్ నుంచి పొందుతాయి. ఈ ఆంథోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లలాగే శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి.

click me!