మీ చర్మం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి..!

First Published | Nov 22, 2023, 4:34 PM IST

అసలు మన చర్మం మనకు ఏం చేస్తుంది. దీని పని ఏంటని అడిగితే ఏం చెప్తారు.. ఇంకేం చేస్తుంది ఇది మన  శరీరాన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుందంటారు అంతేనా? నిజానికి మన చర్మం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ.  చర్మం మనం వేడిని, చలిని గుర్తించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అసలు చర్మం గురించి మనకు తెలియని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

శరీరంలోని అతిపెద్ద అవయవం

అవును.. మన చర్మం మన శరీరంలోనే అతిపెద్ద అవయవం. అలాగే మన లోపలి అవయవాలను, మాంసాన్ని, ఎముకలను కప్పడానికి సుమారు 1.73 చదరపు మీటర్లు లేదా 18.5 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఆక్రమిస్తుంది. చర్మం మన శరీర బరువులో 16 శాతం ఉంటుంది. మన చర్మం మన శరీరాన్ని కప్పి ఉంచే పెద్ద దుప్పటి లాంటిదే. మన ఎముకలు, కండరాలు వంటి లోపలి ప్రతి అవయవాన్ని సురక్షితంగా ఉంచడానికి మన చర్మం ఎంతో కష్టపడుతుంది.
 

తనను తాను పునరుత్పత్తి చేస్తుంది

మానవ చర్మం గురించి నమ్మశక్యం నిజాలలో ఇది ఒకటి. మన చర్మం తనను తాను పునరుత్పత్తి చేయగలదు తెలుసా? మన చర్మం ప్రతిరోజూ దాని చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అలాగే  ప్రతి 28 రోజులకు చర్మం కొత్త పొరను సృష్టిస్తుంది కూడా. మన చర్మంపై చిన్న చిన్న కోతలు, స్క్రాప్లను ఎవరి సహాయం లేకుండా నయం చేసే సామర్థ్యం కూడా చర్మానికి ఉంటుంది.  మీరు గమనించారో లేదో మనకు అయ్యే చిన్న చిన్న గాయాలు వాటంతట అవే తగ్గిపోతాయి. 
 

Latest Videos


మిలియన్ల కణాలు 

మన చర్మంలో ఒక చిన్న చదరపు అంగుళంలో సందడిగా ఉండే నగరం లాగే ఎన్నో కణాలు ఉంటాయి. ఇవి మనల్ని సురక్షితంగా ఉంచడానికి ఈ కణాలన్నీ కలిసి పనిచేస్తాయి. కొన్ని కణాలు సూక్ష్మక్రిముల నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మరమ్మత్తు చేయడానికి, పునరుద్ధరించడానికి ఇవి ఎప్పుడూ సిద్దంగా ఉంటాయి. 
 

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది

మన చర్మం మన శరీరానికి థర్మోస్టాట్ వంటిది. మీరు వేడిగా ఉన్నప్పుడు, ఎండలో ఉన్నప్పుడు లేదా పరిగెత్తిన తర్వాత మీ చర్మం మీరు చల్లబరచడానికి సహాయపడుతుంది. ఇది మీకు చెమట పట్టేలా చేయడం చేస్తుంది. ఈ చెమట ఆవిరి అయినప్పుడు శరీరంలో వేడి తగ్గుతుంది. ఇక వెదర్ మరీ చల్లగా ఉన్నప్పుడు దీనికి విరుద్దంగా చేస్తుంది. లోపలి వేడిని ట్రాప్ చేయడానికి రక్త నాళాలను కుదించి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. 

చర్మ మార్పులు ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి

మన చర్మంలో వచ్చే మార్పులు కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చని చర్మనిపుణులు వెల్లడిస్తున్నారు. మన శరీరం లోపల ఏదైనా సరిగ్గా లేనప్పుడు హెచ్చరికలను చర్మం చూపుతుంది. ఉదాహరణకు.. పసుపు రంగు చర్మం కాలేయ సమస్యలను సూచిస్తుంది. ఎరుపు మచ్చలు అలెర్జీలు లేదా మంటను సూచిస్తాయి. అందుకే ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

 డెడ్ స్కిన్ సెల్స్ ను తొలిగిస్తుంది

చర్మం గురించి మనకు  ఆశ్యర్యం కలిగించే విషయాల్లో  ఇది ఒకటి. మన చర్మం నిరంతరం తనను తాను పునరుద్ధరిస్తుంది. అలాగే ప్రతి నిమిషానికి 30,000 నుంచి 40,000 చిన్న చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది కూడా. ఈ పాత కణాలు కిందే కొత్త కణాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ ఎప్పటికీ ఆగదు. ఇది మీ చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండటానికి సహాయపడుతుంది. 
 

మెలనిన్ ఉత్పత్తి 

మెలనిన్ అనే వర్ణద్రవ్యం నుంచి చర్మం దాని రంగును పొందుతుంది. శరీరం ఎంత మెలనిన్ తయారు చేస్తుందనే దానిపై ఆధారపడి చర్మం రంగు  లేత నుంచి ముదురు వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరికీ మెలనిన్ ను ఉత్పత్తి చేసే ఒకే మొత్తంలో కణాలు ఉంటాయి. ఇది బాహ్యచర్మం అని పిలువబడే చర్మం బయటి పొరలో తయారవుతుంది. కానీ ప్రతి ఒక్కరూ ఒకే మొత్తం మెలనిన్ ను ఉత్పత్తి చేయరు. మీ శరీరం ఎక్కువ మెలనిన్ ఉత్పత్తి చేస్తే మీ చర్మం ముదురు రంగులో ఉంటుంది.

click me!