Sleep: తక్కువ నిద్రపోతే.. తొందరగా బరువు పెరుగుతారా?

Published : Aug 06, 2025, 01:27 PM IST

మనం తీసుకునే ఆహారం.. మన బరువుపై ప్రభావం చూపిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ.. నిద్ర ఎలా బరువు మీద ప్రభావం చూపిస్తుంది అనే అనుమానం మీకు రావచ్చు. కానీ, ఇది అక్షరాలా నిజం.

PREV
14
Weight gain

మన శరీరానికి అవసరమైన విశ్రాంతిని కలిగించేది నిద్ర మాత్రమే.కానీ, ఇటీవలి కాలంలో చాలా మంది చాలా రకాల పనుల కారణంగా నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇది శరీర బరువు పెరగడానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మనం తీసుకునే ఆహారం.. మన బరువుపై ప్రభావం చూపిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ.. నిద్ర ఎలా బరువు మీద ప్రభావం చూపిస్తుంది అనే అనుమానం మీకు రావచ్చు. కానీ, ఇది అక్షరాలా నిజం. నిద్ర మన ఆరోగ్యంపై చూపే ప్రభావం, బరువు పెరుగుదలతో ఉన్న సంబంధం శాస్త్రీయంగా నిరూపితమైంది.

24
హార్మోన్ల అసమతుల్యత..

నిద్ర తక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని ముఖ్యమైన హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, ముఖ్యంగా ఆకలి , తృప్తిని నియంత్రించే లెప్టిన్ (Leptin), ఘ్రెలిన్ (Ghrelin) అనే హార్మోన్ల స్థాయిలు మారిపోతాయి. లెప్టిన్ అనే హార్మోన్ తిన్న తర్వాత తృప్తిగా ఉన్నామని మెదడుకు సంకేతం ఇస్తుంది. అదే విధంగా ఘ్రెలిన్ ఆకలి పుట్టే సంకేతాన్ని ఇస్తుంది. నిద్ర తక్కువగా ఉంటే లెప్టిన్ స్థాయి తగ్గిపోతుంది, ఘ్రెలిన్ స్థాయి పెరుగుతుంది. ఈ స్థితిలో శరీరానికి అవసరం లేకపోయినా తినాలనే కోరిక కలుగుతుంది. ఫలితంగా అధికంగా తినేస్తాం.. చివరకు అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది.

ఇది మాత్రమే కాదు, నిద్ర తగ్గినప్పుడు శరీరంలో కార్టిసాల్ (Cortisol) అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. కార్టిసాల్ అధికంగా ఉన్నప్పుడు ఇది కూడా బరువు పెరుగుదలకి కారణమవుతుంది. దీని వల్ల శరీరంలో ఫ్యాట్ కూడా పేరుకుపోతుంది. అలాగే నిద్రలేమి మెటబాలిజం ను నెమ్మదిగా చేస్తుంది. దీని వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాక, శరీరంలో కొవ్వుగా నిల్వై బరువును పెంచుతుంది.

34
అధిక ఆకలి...

ఇంకా, నిద్ర తక్కువ పోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. దాంతో వ్యక్తికి అలసట ఎక్కువగా అనిపిస్తుంది. ఈ కారణంగా వ్యక్తి రోజు చేసే శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఉదాహరణకు, వ్యాయామం చేయాలన్న ఆసక్తి లేకుండా పోతుంది. రోజు చేయవలసిన పనులు కూడా మందగిస్తాయి. శరీరంలోని calorie expenditure తగ్గిపోతుంది. దీని వల్ల శరీరంలో కేలరీలు ఖర్చు అవ్వవు. కేలరీలు ఖర్చు అవ్వకపోతే కూడా బరువు పెరిగిపోతాం.

అంతేకాదు..నిద్ర తక్కువగా నిద్రపోయే వారికి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అది కూడా జంక్ ఫుడ్ వైపు మనసు లాగుతూ ఉంటుంది. పిజ్జా, బర్గర్, చాక్లెట్ వంటి అధిక కేలరీలు కలిగిన processed foods పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఇవి తినడం వల్ల కూడా అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, నిద్ర సరిగా పోకపోతే అలసట మాత్రమే కాదు.. బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.  ఇదే విషయాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ధ్రువీకరించారు.

44
ఎన్ని గంటలు నిద్ర పోవాలి?

శరీర బరువు కంట్రోల్ లో ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది, మెటబాలిజాన్ని సహజంగా ఉంచుతుంది. ఆకలిపై కంట్రోల్ ఉండేలా చేస్తుంది. ప్రత్యేకంగా రాత్రి 10 నుండి తెల్లవారుజామున 5–6 గంటల మధ్య నిద్రపోవడం ద్వారా హార్మోన్ల విడుదల ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇది శరీరానికి సహజమైన రీచార్జింగ్ సిస్టమ్ వలె పనిచేస్తుంది.

మొత్తానికి, బరువు తగ్గాలంటే లేదా నియంత్రించాలంటే కేవలం తినే ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు, నిద్రకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది తగిన నిద్రతోనే మొదలవుతుంది. కాబట్టి ప్రతి రోజు నిర్ణీత సమయానికి నిద్రపోయి, కనీసం 7–8 గంటల నిద్ర ఉండేలా చూసుకుంటే.. శరీర బరువును నియంత్రించడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories