Chia Seeds: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా చియా సీడ్స్ తినకూడదు!

Published : Aug 06, 2025, 12:54 PM IST

Chia Seeds:చియా సీడ్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చాలామంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ ని వారి డైట్ లో చేర్చుకుంటారు. చియా సీడ్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలున్నవారు వీటిని అస్సలు తినకూడదు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
16
Chia Seed Side Effects

చియా గింజలు చూడటానికి చిన్నవిగా ఉన్నా.. ప్రయోజనాలు మాత్రం ఎక్కువే. ఇవి పేగు ఆరోగ్యానికి మంచివి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఒమేగా-3 మెదడు పనితీరుకు సహాయపడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చియా సీడ్స్ కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు తినడం అస్సలు మంచిదికాదట. మరి ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదో ఇక్కడ చూద్దాం. 

26
జీర్ణ సమస్యలు

నానబెట్టిన చియా గింజలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. కానీ ఇప్పటికే కడుపు ఉబ్బరం, పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు చియా గింజలు తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు చియా గింజలు తీసుకోవడం ద్వారా సమస్య మరింత పెరుగుతుంది. కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.

36
అధిక రక్తపోటు

చియా గింజల్లోని ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం, పొటాషియం రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. కానీ ఇప్పటికే బీపీకి మందులు వాడుతున్నవారు చియా గింజలు తినకూడదు. మందులు వాడుతున్నప్పుడు చియా గింజలు తింటే అవి రక్తపోటును మరింత తగ్గిస్తాయి. దానివల్ల తలతిరుగుడు, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత చియా సీడ్స్ తీసుకోవడం మంచిది.  

46
రక్త హీనత

రక్తహీనత, రక్తంగా పల్చగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు చియా గింజల్ని తీసుకోకపోవడమే మంచిది. వీరు చియా సీడ్స్ ని ఎక్కువగా తీసుకుంటే అవి వారు వేసుకునే మందులతో రియాక్షన్ జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తహీనత వంటి సమస్య ఉన్నవారు చియా సీడ్స్ కి దూరంగా ఉండాలి.  

56
అలెర్జీ

చియా గింజల వల్ల కొంతమందికి అలెర్జీ రావచ్చు. నువ్వులు, ఆవాల వంటి వాటివల్ల మీకు అలెర్జీ వస్తే.. చియా గింజల వల్ల కూడా అలెర్జీ రావచ్చు. దురద, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. 

చియా విత్తనాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదికాదు. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ గింజలకు దూరంగా ఉండటమే మంచిది. 

66
గమనిక

చియా గింజలను నానబెట్టి తిన్నా, విడిగా నీరు తాగాలి. చియా నీటిని పీల్చుకున్నప్పటికీ వాటిని తినడం వల్ల శరీరంలో నీటి శాతం పెరగదు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. చియా సీడ్స్ ని డైరెక్ట్ గా తింటే కడుపు ఉబ్బరం లేదా గొంతు మూసుకుపోవడం వంటి సమస్య రావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories