Sleep deprivation:బహుషా మీక్కూడా తెలియదేమో.. నిద్రపోకుంటే ఇన్ని రోగాలొస్తాయన్న సంగతి..!

First Published Jun 28, 2022, 4:56 PM IST

Sleep deprivation: శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి, శక్తివంతంగా తయారుచేయడానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రలేకుండా 11 రోజులకంటే ఎక్కువ రోజులు బతకం అన్న సంగతి  చాలా తక్కువ మందికే తెలుసు. అందులో దీర్ఘకాలిక నిద్రలేమి ఎన్ని రోగాలను పుట్టిస్తుందో తెలుసా..? 
 

అలసి సొలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రతోనే సగం రోగం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అందుకే ఆరోగ్యం బాగాలేని వారు ఎక్కువగా ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ నేడు చిన్న వయసు వారి నుంచి పెద్దవయసు వారు సైతం నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒక ఒక వయోజనుడు ప్రతి రాత్రి సుమారు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. 
 

నిద్ర లేమి (Sleep deprivation)అనేది అవసరమైన మొత్తం కంటే తక్కువగా నిద్రపోవడం అని అర్థం. పెద్దలతో పోలిస్తే పిల్లలకు, టీనేజర్లకు ఎక్కువ నిద్ర అవసరం. ఒక రాత్రి సరిగ్గా నిద్రపోకుంటే.. మరుసటి రోజు అలసట, విసుగు వస్తాయి. ఏదేమైనా దీర్ఘకాలిక నిద్ర లేమి శరీరంపై అధ్వాన్నమైన ప్రభావాలను కలిగిస్తుంది.

దీర్ఘకాలిక నిద్ర లేమి మీ శరీరానికి చేసేది ఇదే:

దీర్ఘకాలిక నిద్రలేమి శరీరంలోని ఆహార సంబంధిత హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. లెప్టిన్ (Indicator of fullness / appetite), గ్రెలిన్ (An indicator of hunger) అనే రెండు హార్మోన్లు వరుసగా తగ్గించబడతాయి, పెరుగుతాయి. అందుకే వీళ్లకు చాలా ఫాస్ట్ గా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకాleptin లో తగ్గుదల.. మీకు తెలియకుండానే అతిగా తినేలా చేస్తుంది.

Fatigue

శారీరక శ్రమను తగ్గిస్తుంది

దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇది మీకు అలసట (Fatigue)ను కలిగిస్తుంది. ఇది మీ శారీరక కదలికలను, కార్యకలాపాన్ని తగ్గించుకునేలా చేస్తుంది లేదా పూర్తిగా వ్యాయామం చేయడం మానేయవచ్చు.
 

రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది

సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా మీ రోగ నిరోధక శక్తి (Immunity)తగ్గుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ వైరస్ లు, బ్యాక్టీరియా వంటివి మీ శరీరానికి హాని కలిగించే ఏదైనా బాహ్య కారకాలతో పోరాడటానికి పనిచేస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల బ్యాక్టీరియాతో పోరాడటానికి తగినంత పదార్థాలను తయారు చేసే శరీరసామర్థ్యం తగ్గుతుంది. 
 

మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది

నిద్ర లేమి మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మానసిక రుగ్మతల (Mental disorders)కు కారణమవుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మతిస్థిమితం కోల్పోవడం, ఆందోళన (Anxiety), డిప్రెషన్ ( Depression)మొదలైన మానసిక రుగ్మతలు వస్తాయని రుజువు చేయబడింది. వాస్తవానికి ఎక్కువ కాలం నిద్రలేమి ఉంటే అంది భ్రాంతులకు (hallucinations) కూడా కారణం కావచ్చు. అంటే వాస్తవంలో ఉనికిలో లేని విషయాలను మీరు వినడం లేదా చూడటం లేదా అనుభూతి చెందే స్థితి అన్న మాట.
 

గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది

నిద్ర లేకుండా.. క్రమం తప్పకుండా పనిచేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Blood sugar levels), రక్తపోటు (Blood pressure), ఇతర గుండె సంబంధిత విధులను కూడా ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర శరీరంలోని అన్ని భాగాలను,  గుండె సంబంధిత సమస్యలను మరమ్మతు చేయడానికి, నయం చేయడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం వల్ల మీకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేమి వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురయ్యే అవకాశం కూడా ఉందని ఒక అధ్యయనం చూపించింది.

మధుమేహానికి కారణమవుతుంది

పైన చెప్పిన విధంగా గుండె సంబంధిత విధులను సక్రమంగా నిర్వర్తించడానికి శరీరానికి తగినంత నిద్ర అవసరం. నిద్ర లేమి శరీరంలోని రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో మధుమేహం (Diabetes)లేదా ఇతర జీవక్రియ సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. 
 

హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది

పైన చెప్పిన విధంగా ఆహార సంబంధిత హార్మోన్ల మాదిరిగానే అన్ని అవయవాలకు సరైన మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. నిద్ర లేమి పిల్లల్లో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది.

అలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర లేమి మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అలాగే  అలసట కలిగిస్తుంది.  ముఖ్యంగా దీర్ఘకాలికంగా నిద్ర లేకపోవడం శరీరానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా నిద్రపోనట్టైతే.. వెంటనే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. లేదంటే లేని పోని రోగాలను అంటించుకునే ప్రమాదం ఉంది. 

click me!