IPL 2024, SRH vs LSG : ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు సిక్సర్ల మోతతో హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది.
IPL 2024, SRH vs LSG : ఊచకోత అంటే ఎలా ఉంటుందో చూపించారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు. లక్నో బౌలర్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్న చూపించారు. ట్రావిస్ హెడ్ దెబ్బకు లక్నో ప్లేయర్లు తల పట్టుకున్నారు. అభిషేక్ శర్మ మరోసారి స్టేడియాన్ని షేక్ చేశాడు. ఇద్దరు ప్లేయర్లు రికార్డు హాఫ్ సెంచరీలో హైదరాబాద్ టీమ్ కు అద్భుత విజయాన్ని అందించారు. పవర్ ప్లే లో 100+ పరుగులు సాధించిన ఇద్దరు.. 10 ఓవర్లు ముగియక ముందే 167 పరుగుల సాధించి హైదరాబాద్ కు 10 వికెట్ల తేడా విజయాన్ని అందించారు. ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకు తీసుకెళ్లారు. ఈ విజయంతో హైదరాబాద్ టీమ్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో టాప్-3లోకి వచ్చింది. మొదటి రెండు స్థానాల్లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి.
స్టేడియం దద్దరిల్లిపోయింది.. బౌండరీల వర్షం కురిసింది !
ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్ల దుమ్మురేపే బ్యాటింగ్ తో 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో క్రికెట్ లవర్స్ బౌండరీల వర్షం తడిసిపోయారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. అయితే, ఛేజింగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 167 పరుగులు చేసి అద్భుత విజయాన్ని సాధించింది. సన్‌రైజర్స్ తరఫున ట్రావిస్ హెడ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.
ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెడ్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు లక్నో బౌలింగ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. స్ట్రైక్ రేట్ 296.67తో తన ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. మరో ఎండ్ లో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులతో స్టేడియాన్ని షేక్ చేశాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అభిషేక్ 267.86 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
A stylish strike to end a stylish chase!
Simply special from the openers 🤝
Recap the match LIVE on and 💻📱 | pic.twitter.com/2xUlOlS1kk
చివరలో మెరిసిన లక్నో.. కానీ..
అంతకుముందు లక్నో తరఫున ఆయుష్ బడోని 30 బంతుల్లో 55 పరుగులు, నికోలస్ పురాన్ 26 బంతుల్లో 48 పరుగులు చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 29 పరుగులు, కృనాల్ పాండ్యా 21 బంతుల్లో 24 పరుగులు చేశారు. మార్కస్ స్టోయినిస్ 3 పరుగుల వద్ద అవుట్ కాగా, క్వింటన్ డి కాక్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. సన్‌రైజర్స్ తరఫున భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
ఏ జట్లు ప్లేఆఫ్ కు చేరుకుంటాయి? ముంబై, బెంగళూరు జట్లకు ఛాన్స్ ఉందా?