Relations: ఈ లక్షణాలున్న అబ్బాయిలను భరించడం కష్టం..!

First Published Dec 3, 2021, 11:53 AM IST

మీరు మంచి పని చేసినా.. ఏదైనా పని సరిగా చేయలేక పోయినా.. కంటిన్యూస్ గా విమర్శిస్తూనే ఉంటారు. మీరు ఆనందంగా ఉండటం కూడా వారు చూడలేరు. కాబట్టి.. విమర్శిస్తూనే ఉంటారు.

ఒక బంధం సవ్యంగా సాగాలన్నా.. ఆనందంగా ఉండాలన్నా.. ఆ బంధంలోని ఇద్దరూ కరెక్ట్ గా ఉండాలి. ఇద్దరూ ఒకరిపై మరొకరు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి.  ఒకరి అభిప్రాయాలను.. మరొకరు గౌరవించాలి. ఒకరి ఆనందం కోసం మరొకరు పాటుపడాలి. అలా కాకుండా.. ప్రతిసారీ తాను చెప్పిందే జరగాలనీ.. తమదే.. ఆధిపత్యం అని చూపించాలని అనుకుంటూ ఉంటారు.  ముఖ్యంగా.. అబ్బాయిలు.. తమ పార్ట్ నర్ పై ఆధిపత్యం చలాయించాలని అనుకుంటూ ఉంటారట. తమ పార్ట్ నర్ ని కంట్రోల్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా కంట్రోల్ చేసే అబ్బాయిలు.. ఎలా గుర్తించాలి అనే విషయాన్ని.. ఇదిగో ఇలా తెలుసుకోవచ్చు.

తమ పార్ట్ నర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకునే అబ్బాయిలు... అసాధ్యమైన డిమాండ్స్ చేస్తూ ఉంటారట. అది ఎదుటివారిని చాలా ఇబ్బంది పెడుతుందట. వాటిని మనం పూర్తి చేయలేకపోయామనే బాధ కూడా ఉంటుందట.

కొందరు కంటిన్యూస్ గా... విమర్శిస్తూనే ఉంటారు. మీరు మంచి పని చేసినా.. ఏదైనా పని సరిగా చేయలేక పోయినా.. కంటిన్యూస్ గా విమర్శిస్తూనే ఉంటారు. మీరు ఆనందంగా ఉండటం కూడా వారు చూడలేరు. కాబట్టి.. విమర్శిస్తూనే ఉంటారు.
 

ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తారు. కానీ.. వారు చెప్పినట్లు మీరు చేసినప్పుడు మాత్రమే. వారంటూ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. ఆ కండిషన్స్ కి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే.. వారు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. లేదంటే.. మీ ప్రేమకు పరిక్షీలు పెడుతూ  ఇబ్బంది పెట్టాలని  చూస్తుంటారు.

మీరు తప్పులు చేస్తే.. ఆ తప్పులకు గిల్టీ ఫీలయ్యేలా.. మీరు చేసిన తప్పుని పదే పదే గుర్తు చేస్తూ.. బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. ఒక్కోసారి మీరు చేయని తప్పులను కూడా ఎత్తి చూపుతూ.. బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు.

మీరు ఏం చేస్తున్నారు..? ఏమి చూస్తున్నారు..?  ప్రతి నిమిషం మీపై వారు ఓ కన్నేసి ఉంచుతారు. ప్రతి నిమిషం.. మిమ్మల్ని చెక్ చేస్తూనే ఉంటారు. మరు ఎక్కడి వెళ్తున్నారు.. ఎవరితో మాట్లాడుతున్నారు.. అనే విషయాన్ని కూడా వారు ప్రతి నిమిషం చెక్ చేస్తూనే ఉంటారు.

అంతే.. మీ పై  ఆధిపత్యం చెలాయించాలి.. మిమల్ని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచాలి అనుకునేవారు.. మీద కొంచెం పొసెసివ్ గా ఉంటారు. మీరు.. ఇతరులతో సమయం గడపడం కూడా వారికి నచ్చదు..  ఎప్పుడూ.. మీ అటెన్షన్ వారిపై మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

మీరు చెప్పేది నిజమైనప్సటికీ.. అది వారికి అనుకూలంగా లేకపోతే.. మాటలు ఎటునుంచి ఎటైనా తిప్పేయగలరు. తిమ్మిని బొమ్మిని చేసి.. మిమ్మల్ని ఓ ఆట ఆడుకుంటారు.

అంతేకాదు.. వారికి అనుకూలంగా.. మిమ్మల్ని మానిప్యూలట్ చేస్తూ ఉంటారు. వారికి  ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్న విషయాన్ని మాత్రమే ఆలోచిస్తారు. అంతేకాదు.. మిమ్మల్ని ఏ విషయంలో సంతృప్తి చెందనివ్వరు. పైకి ప్రేమ చూపిస్తున్నట్లే చూపించి...  మాటలతో బాధపెడుతూ ఉంటారు.

click me!