నానబెట్టిన వాల్ నట్స్ తో.. డయాబెటిస్ కంట్రోల్....!!

First Published Oct 11, 2021, 1:56 PM IST

వాల్‌నట్‌లను నానబెట్టడం ఆరోగ్యకరమైన అలవాటు, ఎందుకంటే నట్స్, సీడ్స్ లో కొన్ని ఎంజైమ్‌ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లను పచ్చిగా జీర్ణం చేయడం కష్టం. అందువల్ల, వీటిని నానబెట్టడం వల్ల చక్కగా జీర్ణమవుతాయి. అంతేకాదు నానబెట్టడం వల్ల వాటిలోని పోషకవిలువలు తగ్గిపోవని, లక్షణాల్లో ఏమాత్రం తేడా రాదని తేలింది. 

ఆరోగ్యకరమైన పోషకాహారం గురించి మాట్లాడుకునేప్పుడు నట్స్, సీడ్స్ ప్రముఖంగా వినిపిస్తాయి. ఎందుకంటే వీటిల్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. పోషకాలతో నిండిన అటువంటి వాటిల్లో ఒకటి వాల్‌నట్స్. వాల్‌నట్‌లు, మనిషి మెదడు ఆకారంలో ఉంటుంది. శరీరం మొత్తానికి ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో బాగా పనిచేస్తుంది. 

అక్రోట్లను నానబెట్టాలా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాల్‌నట్‌లను నానబెట్టడం ఆరోగ్యకరమైన అలవాటు, ఎందుకంటే నట్స్, సీడ్స్ లో కొన్ని ఎంజైమ్‌ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లను పచ్చిగా జీర్ణం చేయడం కష్టం. అందువల్ల, వీటిని నానబెట్టడం వల్ల చక్కగా జీర్ణమవుతాయి. అంతేకాదు నానబెట్టడం వల్ల వాటిలోని పోషకవిలువలు తగ్గిపోవని, లక్షణాల్లో ఏమాత్రం తేడా రాదని తేలింది. 

డయాబెటిస్ కోసం వాల్‌నట్స్ : నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేయచ్చట. వీటిల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో చక్కెరను శరీరంలోకి విడుదల చేయడాన్ని తగ్గిస్తాయి. ఇది హానికరమైన చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తాయి. అలాగే, నానబెట్టిన వాల్‌నట్‌లలో  గ్లైసెమిక్ ఇండెక్స్ 15 మాత్రమే ఉంటుంది. వాల్‌నట్‌లు ఇన్సులిన్ నిరోధకతను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కూడా తేలింది.

ఆరోగ్య ప్రయోజనాలు
ఇవే కాకుండా, వాల్‌నట్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  చర్మానికి,  జుట్టుకు మేలు చేసే సహజ నూనెలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వాల్‌నట్స్ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గుతుందట.

చిలీ వాల్‌నట్స్ ఉత్తమమైనవి?
ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి చిలీ వాల్‌నట్స్.. ఇవి లేత రంగు, తాజాదనం, అధిక దిగుబడినిస్తాయి. ఇటీవల, చిలీ నట్, చిలీ వాల్‌నట్‌ల పెంపకందారులు, ఎగుమతిదారుల సంఘం భారతీయ వినియోగదారులకు వీటిని పరిచయం చేయడానికి భారతదేశంలో మొట్టమొదటి జెనెరిక్ ప్రమోషన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దీనివల్ల భారతదేశంలో వాల్‌నట్స్ వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. 

వాల్‌నట్స్ ఎగుమతి వ్యాపారం
చిలీనట్ ప్రెసిడెంట్ ఎడ్ముండో వాల్డెర్రామా ప్రకారం, "వాల్నట్ ఎగుమతిలో ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద దేశం చిలీ. చిలీ వాల్‌నట్‌లు 70 కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ దేశాల్లో భారతదేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి.

click me!