Raw Banana/Ripe Banana: అరటికాయ, అరటిపండు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు?

Published : Nov 05, 2026, 08:10 PM IST

Raw Banana/Ripe Banana: అరటికాయను వండుకుని తింటాం..అరటిపండును నేరుగా తింటాం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ? అరటికాయ పండే కొద్దీ అందులోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అందుకే అరటిపండు తియ్యగా, మెత్తగా ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు?

PREV
16
అరటిపండు తినాలా లేక అరటికాయ తినాలా?

అరటిపండు తినాలా లేక పచ్చి అరటికాయ తినాలా? మీ ఆరోగ్యానికి ఏది కరెక్ట్? మన రోజువారీ భోజనంలో అరటిపండుకు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధరకే దొరికే ఈ పండు రుచితో పాటు బోలెడు పోషకాలను ఇస్తుంది. పండిన తర్వాతే కాదు, పచ్చిగా ఉన్నప్పుడు కూడా అరటికాయతో కూర, సాంబార్, చిప్స్ లాంటివి చేసుకుంటాం. అయితే ఈ రెండూ ఒకే చెట్టు నుంచి వచ్చినా, వాటిలోని పోషకాలు, మన శరీరంపై చూపే ప్రభావం వేరుగా ఉంటాయి.

26
వర్కవుట్ చేసేవాళ్లకి ఏది బెటర్

ఆరోగ్యపరంగా చూస్తే ఏది మంచిది? బరువు తగ్గాలనుకునే వాళ్లు అరటికాయ తినాలా? వర్కవుట్ చేసేవాళ్లు అరటిపండు తినడం మంచిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మీ డైట్‌కు తగ్గట్టు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. పచ్చిగా ఉండే అరటికాయను నేరుగా తినలేం. అందుకే తొక్క తీసి ఉడకబెట్టి లేదా కూరలు వండుకుని తింటాం. దక్షిణ భారతదేశంలో అరటికాయతో సాంబార్, కూర, మసాలా వంటకాలు చేస్తారు. కొందరు చిప్స్, కట్లేట్స్ రూపంలో కూడా తింటారు.

36
పదే పదే ఆకలి వేయదు

అరటికాయలో కాంప్లెక్స్ స్టార్చ్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన ఫీలింగ్‌ను ఎక్కువసేపు ఉంచుతాయి. దీనివల్ల పదే పదే ఆకలి వేయదు. అరటికాయలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. కాబట్టి పేగుల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్లు అరటికాయను మితంగా డైట్‌లో చేర్చుకోవచ్చు. అయితే నూనెలో వేయించిన చిప్స్ కంటే, ఉడకబెట్టిన లేదా తక్కువ నూనెతో చేసిన వంటకాలు తినడం మంచిది.

46
డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది

అరటికాయలో స్టార్చ్ ఎక్కువగా ఉండటం వల్ల, పండిన అరటిపండు కంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. అలాగని అరటికాయ తింటే షుగర్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని కాదు. మధుమేహం ఉన్నవాళ్లు తమ బ్లడ్ షుగర్ లెవల్స్, డైట్, వ్యాయామాన్ని బట్టి అరటికాయను తినాలి. ఎంత తింటున్నాం, ఎలా వండుతున్నాం అనేది కూడా ముఖ్యమే. దీనిపై డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

56
త్వరగా జీర్ణమవుతుంది

పచ్చి అరటికాయ పండి పసుపు రంగులోకి మారేటప్పుడు, అందులోని స్టార్చ్ నెమ్మదిగా చక్కెరగా మారుతుంది. అందుకే పండిన అరటిపండు తియ్యగా ఉంటుంది. దీన్ని వండాల్సిన పనిలేదు, ఆకలి వేసినప్పుడు తొక్క తీసి తినేయొచ్చు. అరటిపండులోని సహజ చక్కెరలు శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తాయి. క్రీడాకారులు, వ్యాయామం చేసేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఆట మధ్యలో అలసిపోయినా, వర్కవుట్ తర్వాత శక్తి కావాలన్నా అరటిపండు బాగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు.

66
డైట్‌లో చేర్చుకోవచ్చు

బరువు పెరగాలనుకునే వాళ్లు అరటిపండును డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇందులోని న్యాచురల్ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి. పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే అదనపు పోషకాలు అందుతాయి. అయితే అరటిపండు మాత్రమే తింటే బరువు పెరగరు, సరైన డైట్, వ్యాయామం కూడా ఉండాలి. షుగర్ ఉన్నవాళ్లు అరటిపండును పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. కానీ ఎంత తింటున్నారు, దేనితో కలిపి తింటున్నారు అనేది చూసుకోవాలి.

మొత్తానికి, ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించాలంటే అరటికాయ బెస్ట్. వెంటనే ఎనర్జీ కావాలంటే అరటిపండు బెస్ట్. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం తెలివైన పని.

Read more Photos on
click me!

Recommended Stories