Cow Ghee Vs Buffalo Ghee: ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండింటి లో ఏది మంచిది?

Published : Nov 05, 2026, 04:22 PM IST

Cow Ghee Vs Buffalo Ghee: నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకి ఒక స్పూన్ నెయ్యి తినాలని కూడా చెబుతుంటారు. కానీ ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండింటిలో ఏది మంచిది?

PREV
13
ఇంట్లో ఏ నెయ్యి వాడుతున్నారు?

వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. చాలా మంది తమ ఇంట్లో నెయ్యిని నిత్యం వాడుతూ ఉంటారు. కానీ, మార్కెట్లో దొరికే లేదా ఇంట్లో తయారు చేసుకునే ఈ నెయ్యి విషయానికి వస్తే.. అందరిలోనూ ఒక డౌట్ ఉంటుంది. ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిదా? ఈ రెండు రకాల నెయ్యి పాల నుంచే తయారైనప్పటికీ, వాటి పోషక విలువల్లో, కొవ్వు పదార్థాల్లో తేడాలు ఉంటాయి. మరి.. రోజూ వాడకానికి ఈ రెండింటిలో ఏ నెయ్యి ఎంచుకోవడం మంచిది..? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిబంధనల ప్రకారం.. నెయ్యిలో సంతృప్త కొవ్వులు (Saturated Fats) ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు కూడా సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే పదార్థాల కంటే, అసంతృప్త కొవ్వులు (Unsaturated Fats) ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అందుకే, నెయ్యిని ఇష్టానుసారంగా కాకుండా, మితంగా మాత్రమే తీసుకోవాలి.

23
ఏ నెయ్యి ఆరోగ్యకరమైనది?

ఆవు నెయ్యి, గేదె నెయ్యి రెండింటిలో పోషకాల విషయంలో కాస్త తేడాలు ఉండొచ్చు. కానీ రెడింటిలోనూ ఉండేది ఫ్యాట్స్. కాబట్టి "ఆవు నెయ్యి అందరికీ మంచిది" లేదా "గేదె నెయ్యి ఆరోగ్యానికి హానికరం" అనో చెప్పడం సరికాదు. అసలు విషయం ఏమిటంటే... మీ రోజువారీ ఆహారంలో మొత్తం కొవ్వు ఎంత తీసుకుంటున్నారనేది ముఖ్యం. మీ డైట్‌లో ఇప్పటికే పాలు, పన్నీర్, వెన్న, స్వీట్లు వంటి హై-ఫ్యాట్ పదార్థాలు ఎక్కువగా ఉంటే, మీరు రోజువారీ వంటకాల్లో ఉపయోగించే నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉండాలి.

33
రోజువారీ డైట్‌లో నెయ్యి ఎంత తింటే మంచిది?

ప్రతి ఒక్కరికీ సరిపోయే ఒకే నిర్దిష్ట కొలతంటూ ఏదీ ఉండదు. మీ శరీరానికి కావలసిన క్యాలరీలు, మీ ఆహారపు అలవాట్లు, మీ శారీరక శ్రమ స్థాయిని బట్టి నెయ్యి తీసుకోవడం ఆధారపడి ఉంటుంది. అంటే, మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నా, ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తున్నారా అయితే.. మీరు చాలా తక్కువ మొత్తంలో నెయ్యి తీసుకోవాలి.

నెయ్యి ఎవరు తినకూడదు..?

కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బులు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నెయ్యిని ఎంత మోతాదులో తీసుకోవచ్చనే దానిపై వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.

నెయ్యి ఎలా తీసుకోవాలి?

మనం సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే నెయ్యిని భోజనంలో భాగం చేసుకోవాలి. అన్నం, పప్పు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు అన్నీ రోజువారీ భోజనంలో భాగం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాటిలో ఒక స్పూన్ నెయ్యి చేర్చుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories