3. జరిగిన అవమానాలు..
ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు లేదా అందరిలో అవమానించినప్పుడు, ఆ బాధను వెంటనే పట్టుకుని అందరికీ చెప్పుకోవడానికి పరుగెత్తుతుంటాం. కానీ చాణక్యుని ప్రకారం ఇది చాలా తప్పు. మీ అవమానాన్ని ఇతరులతో పంచుకుంటే, వారు మీ పట్ల గౌరవం కోల్పోవడమే కాకుండా, మీ వీక్‌నెస్‌గా భావించి మరింత చిన్నచూపు చూస్తారు. సమాజంలో మీ హుందాతనం తగ్గిపోతుంది.
4. మీ ప్రణాళికలు..
మీరు భవిష్యత్తులో సాధించాలనుకునే లక్ష్యాలు లేదా ప్రాజెక్ట్‌ల గురించి ముందుగానే ఊరూవాడా డప్పు కొట్టకండి. ఒక వివేకవంతుడు తన ఆలోచనను రహస్యంగా ఉంచి, అది పూర్తయిన తర్వాతే లోకానికి తెలియజేస్తాడు. ఏ పని జరగకముందే దానిని బహిరంగపరిస్తే, మీ పోటీదారులు మీ మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి అవకాశం ఇచ్చినట్టవుతుంది.
5. ఆర్థిక నష్టాలు, డబ్బు సమస్యలు
డబ్బు విషయాలను ఎప్పుడూ పబ్లిక్ చేయకూడదు. మీ ఆర్థిక ఇబ్బందులను ప్రతి ఒక్కరితో పంచుకోవడం వల్ల ఎవరూ మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. బదులుగా, సమాజం మిమ్మల్ని చిన్నచూపు చూస్తుంది, మీ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుంది. ఇది మీ వ్యాపార భాగస్వాముల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది, రుణదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. కాబట్టి మీ ఆర్థిక విషయాలు అత్యంత నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోండి.