మేడారం వెళ్తున్నారా..? ఈ ప్లేసులు మిస్ అవ్వకండి..!

First Published | Feb 19, 2024, 1:20 PM IST

అయితే.. దర్శనం తర్వాత తిరిగి ఇంటికి రాకుండా..  అక్కడే ఉన్న కొన్ని ప్లేసులను మీరు చుట్టిరావాల్సిందే. మరి అలాంటి ప్లేసులేంటో ఓసారి తెలుసుకుందామా..
 


మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర మొదలవ్వబోతోంది. ఈ మేడారం వెళ్లేందుకు దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వెళుతూ ఉంటారు. మీరు కూడా  మేడారం వెళ్లి.. ఆ సమ్మక్క, సారలమ్మ తల్లిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే.. దర్శనం తర్వాత తిరిగి ఇంటికి రాకుండా..  అక్కడే ఉన్న కొన్ని ప్లేసులను మీరు చుట్టిరావాల్సిందే. మరి అలాంటి ప్లేసులేంటో ఓసారి తెలుసుకుందామా..
 

laknavaram bridge

లక్నవరం సరస్సు
తాడవాయి వరంగల్ రోడ్డులో లక్నవరం సరస్సును సందర్శించవచ్చు. ఇక్కడ వేలాడే వంతెన ప్రధాన ఆకర్షణ. చూడటానికి చాలా బాగుంటుంది. చాలా సినిమాల్లో ఈ బ్రిడ్జ్ మీరు చూసే ఉంటారు. కాబట్టి.. హ్యాపీగా అక్కడికి వెళ్లి..ఫోటోలు దిగవచ్చు. సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.

Latest Videos



రామప్ప దేవాలయం
తాడవాయి నుండి వరంగల్ రహదారిలో, జంగల్ పల్లి క్రాపోస్ నుండి 14 కి.మీ దూరంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించవచ్చు. రాళ్లపై అద్భుతమైన కాకతీయుల ఆలయ శిల్పాలకు ప్రసిద్ధి. ఈ ఒక్క ఆలయం దర్శిస్తే.. మీకు కాకతీయుల సంస్కృతి మొత్తం తెలుసుకోవచ్చు.


వరంగల్ నగరం
వరంగల్ నగరం లోపల చూడవలసిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.వెయ్యి స్తంభాల గుడి , భద్రకాళి దేవాలయం , కాకతీయ కోట తప్పక చూడవలసిన ప్రదేశాలు మీరు కూడా వరంగల్ నగరాన్ని కూడా మీరు చుట్టేయవచ్చు.

click me!