ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూఢనమ్మకాలు ఇవే.. వామ్మో మనుషులు మరీ ఇంత దారుణంగా ఉన్నారేంటి?

First Published Nov 26, 2021, 12:23 PM IST

మూఢనమ్మకం (Superstition) అంటే తమను తాము వశించుకోవడం. వాటిని ఆచరించకపోతే ఎలాంటి అరిష్టం కలుగుతుందో అనే భయంతో వీటిని ఇప్పటికీ ఆచరిస్తూ ఉన్నారు. మూఢనమ్మకాలు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని ప్రపంచ దేశస్తులు కూడా (Worldwide countries) వీటిని నమ్ముతారని తెలియజేయడం ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం.
 

భారత దేశ ప్రజలు మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు. మూఢనమ్మకాలకు (Superstition)   భారతదేశం పెట్టింది పేరు. మూఢనమ్మకాలు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలోని ఇతర దేశవాసులు కూడా కొన్ని మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్ముతారు (Followed). వారు పాటిస్తున్నటువంటి వింత వింత మూఢనమ్మకాల గురించి తెలుసుకుంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
 

జపాన్: జపాన్ దేశంలో ఎవరైనా మరణించాక తమకంటూ ఒక ప్రత్యేకమైన దిశ ఉంటుందని భావిస్తారు. అందుకే వారిని మరణించాక ఉత్తర దిక్కు (North direction) లోనే పూడ్చి పెడతారు. ఉత్తర దిక్కున తల చేసుకొని నిద్రించడం (Sleep) శుభంగా భావిస్తారు.
 

కొరియా: కొరియాలోని గర్భవతులకు (Pregnant women) ఒక విచిత్రమైన మూఢ నమ్మకం ఉంది. గ‌ర్భ‌వ‌తులుగా ఉన్నవారు చెల్లాచెదురుగా ఉన్న ఆహారం (Food) తింటే పుట్టే బిడ్డ‌లు క‌ళావిహీనంగా ఉంటార‌ని న‌మ్ముతారు. 
 

రష్యన్లు: సాధారణంగా ఎవరైనా పిట్ట రెట్ట (Quail dropping) వేస్తే చిరాకు పడతాం. కానీ రష్యా ప్రజలు దీన్ని అదృష్టంగా (Good luck) భావిస్తారు. ఇలా పిట్ట ఎవరి మీద రెట్ట వేస్తే వారికి ఎక్కువ మొత్తంలో సంపద కలిసి వస్తుందని భావిస్తారు. 
 

టర్కీ: టర్కీ ప్రజల మూఢనమ్మకాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురవుతారు. ఇక్కడ రాత్రిపూట (Night time) ప్రజలు చివింగం తింటే అది చనిపోయిన కుళ్ళిన మాంసం (Rotten meat) తినడంతో భావిస్తారు.
 

పోర్చుగీస్: ఇక్కడి ప్రజలు వెనక్కి న‌డుస్తుంటే (Walking backwards) దయ్యానికి (Devil) దారి చూపినట్లుగా భావిస్తారు. ఇది ఇక్కడి దేశ ప్రజలు నమ్మే విచిత్రమైన మూఢనమ్మకం.  
 

హంగేరియ‌న్లు: హంగేరియ‌న్లు, ర‌ష్య‌న్లు ఒక్క‌టే న‌మ్ముతారు. కార్న‌ర్ టేబుల్లో (Corner table) కూర్చొని భోజనం (Dinner) చేస్తే పెళ్లి (Marriage) అయ్యే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ట‌. దీనికి పెళ్లికి ఎలా సంబంధ‌మో అస్సలు అర్థంకావ‌డం లేదు.
 

ఫ్రెంచివాళ్లు: కుక్క మలినం (Dog dirt) వారి భవిష్యత్తును తెలుపుతుందని ఫ్రెండ్స్ వాళ్ళు నమ్ముతారు. ఎడమ కాలితో మలినాన్ని తొక్కితే అదృష్టవంతులని (Good luck), కుడి కాలితో తొక్కితే దురదృష్టం (Bad luck)అని నమ్ముతారు.

click me!