వర్షాకాలంలో ఎముకల ఆరోగ్యం కోసం.. అద్భుతమైన ఆహారాలు..

First Published Aug 14, 2021, 2:46 PM IST

డ్రైఫ్రూట్స్, నట్స్ ఎముకలకు కావాల్సినంత పోషకాహారాన్ని అందిస్తాయి. నట్స్ తినడం ఎముకలు పరిపుష్టి అవ్వడంతో పాటు..  వివిధ ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయి. నట్స్ లో కూడా అనేకరకాలు అందుబాటులో ఉన్నాయి. 

వర్షాకాలంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎముకలు శరీర ఆకృతి, నిర్మాణం, మద్దతుకు దోహదం చేస్తాయి. ఎముకల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, రికెట్స్, ఎముక క్యాన్సర్, ఎముక ఇన్ఫెక్షన్లు, పాగెట్స్ వ్యాధి వంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేయడం, సప్లిమెంట్లను తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా వీటినుంచి బయటపడొచ్చు. ఈ వర్షాకాలంలో మీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐదు ఆహార పదార్థాలు ఏంటో చూడండి.. 

నట్స్ : డ్రైఫ్రూట్స్, నట్స్ ఎముకలకు కావాల్సినంత పోషకాహారాన్ని అందిస్తాయి. నట్స్ తినడం ఎముకలు పరిపుష్టి అవ్వడంతో పాటు..  వివిధ ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయి. నట్స్ లో కూడా అనేకరకాలు అందుబాటులో ఉన్నాయి. వాల్‌నట్స్, పెకాన్స్, బాదం, బ్రెజిల్ నట్స్ ముఖ్యంగా మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఈ నట్స్ లో కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం వంటి ఎముకల ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 

సాల్మన్ : చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా  కొవ్వుతో కూడిన చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి అవసరమైన విటమిన్ డి ని అందించడంలో సహాయపడతాయి. ఒమేగా -3, విటమిన్ డి రెండూ ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. ఎముకలను బలోపేతంగా చేయడంలో  సహాయపడతాయి. అందుకే వీటిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి.

పాలు : పాలను సూపర్‌ఫుడ్ అని చెప్పొచ్చు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యాన్ని పెంచడానికి సరైన ఆహారం. బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పాలను స్మూతీలకు జోడించడం, ఓట్స్ తో కలిపి తీసుకోవడం చేయచ్చు. లేదా మీకు పాలు ఇష్టపడుతున్నట్లైతే నేరుగా గ్లాసుడు పాలు తాగేసినా మంచిదే. 

గుడ్లు : రోజుకో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి గుడ్డులోని పోషకాలు బాగా తోడ్పడతాయి. తక్కువ ధరలో ఎక్కువ లాభాలు పొందేలా చేయడంలో గుడ్డు ముందుంటుంది. గుడ్లు పోషకాల శక్తి కేంద్రం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో తక్కువ స్థాయిలో ఉండే ప్రోటీన్ ఎముకల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ప్రోటీన్‌ కోసం  ఆహారంలో గుడ్డును చేర్చడం మంచి ఎంపిక. వీటిని ఉడకబెట్టి, ఆమ్లెట్ గా లేదాంటే హాఫ్ బాయిల్డ్ ఎలాగైనా తినొచ్చు. 

పాలకూర : పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరం. రోజువారీ జీవితంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల  కేవలం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వీలవుతుంది. మీ ఆహారంలో కాలే, ఆకుకూరలు, బోక్ చోయ్, టర్నిప్ వంటి ఆకుకూరలను చేర్చాలి.

click me!