lose thigh fat : తొడ భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించండిలా..

First Published | Jan 24, 2022, 12:08 PM IST

lose thigh fat : శరీరమంతా సన్నగా ఉండి.. తొడలు మాత్రమే లావుగా ఉంటే ఎలా ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదూ. అవును ప్రస్తుతం చాలా మంది యువతులు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ ఈ సమస్య మూలంగా నలుగురిలోకి వెళ్లడానికి కూడా వెనకాడుతుంటారు. 

lose thigh fat : మనుషులందరూ ఒకేలా ఎలా ఉండరో.. వారి శరీరాకృతులు కూడా ఒకేలా ఉండవు. కొందరు సన్నగా సన్నజాజిలా ఉంటే మరికొందరు బొద్దుగా ముద్దుగా ఉంటారు. కానీ ఇంకొందరి శరీరాకృతులు లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే శరీరమంతా సన్నగా ఉంటే తొడలు మాత్రమే లావుగా ఉంటాయి. కారణం ఆ తొడల భాగంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. ఈ సమస్య వల్ల వారు టైట్ డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడానికి కూడా వెనకాడుతుంటారు. ఎందుకంటే ఆ డ్రెస్సులు వేసుకుంటే ఆ భాగమే లావుగా కనిపిస్తుందని. అయితే తొడల భాగంలో పేరుకు పోయిన కొవ్వును కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా ఈజీగా కరిగించొచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 


సైక్లింగ్:  సైక్లింగ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాగా స్లైక్లింగ్ చేస్తే తొడలు, కాళ్లపై ఒత్తిడి (Stress) పెరుగుతుంది. ఫలితంగా తొడలో పేరుకుపోయిన కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడాలంటే ప్రతి రోజూ మీ వ్యాయామంలో స్లైక్లింగ్ ను చేర్చుకోండి. బయటకు చిన్న చిన్న పనులకు వెళ్లినప్పుడు సైకిల్ పైనే వెళ్లేలా అలవాటు చేసుకోండి.

Latest Videos


stairs

బిల్డింగ్ పైకి వెళ్లాలంటే చాలా మంది లిఫ్ట్ లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఇప్పటి నుంచి నడకతో ఎక్కి వెల్లడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇలా నడవడం వల్ల తొడ కండరాలు బాగా కదులుతాయి. తద్వారా ఆ భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. 

నీరు కూడా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఎలాగంటే.. శరీరంలోని కొవ్వును కాలెయం శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియ జరగాలంటే కాలెయానికి సరిపడినన్ని నీళ్లు కావాలి. లేకుంటే శరీరం Dehydration కు గురవుతుంది. దీని వల్ల మెటబాలిజం ప్రాసెస్ నెమ్మదిస్తుంది. అందుకే శరీరానికి కావాల్సిన నీటిని ప్రతిరోజూ తీసుకోవాలి. 
 

ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉండే ఫుడ్ ద్వారా కూడా శరీరంలోని క్యాలరీలన్నీ తగ్గుతాయి. తద్వారా శరీర బరువు కూడా తగ్గుతుంది. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ ను ఈజీగా కరిగించొచ్చు. 

ప్రతిరోజూ జాగింగ్ చేయడం వల్ల కూడా థైస్ లో పేరుకు పోయిన కొవ్వును కరిగించొచ్చు. అలాగే గడ్డిమీద నడిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే శరీరంలో పేరుకు పోయిన అనవసరపు కొవ్వులు, క్యాలరీలు కరగడమే కాకుండా బరువు కూడా ఈజీగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. అంతేకాదు తాజా గాలి ద్వారా కూడా క్యాలరీలను తగ్గించుకోవచ్చు. 

ఆటల ద్వారా కూడా కొవ్వును సులభంగా కరిగించొచ్చు. ప్రతి రోజూ కాసేపు సమయాన్ని కేటాయించి ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ వంటి ఆటలు ఆడండి. దీని ద్వారా మీరు ఎంజాయ్ చేయడమే కాదు తొడ భాగంలో కొవ్వును కూడా కరిగించిన వారవుతారు. 

​ ​


శరీరం ఫిట్ గా ఉండటానికి బలంగా మారడానికి ఎక్సర్ సైజ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. వ్యాయామాల్లో స్విమ్మింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంతో పాటుగా శరీరం సన్నబడటానికి, ఫిట్ గా ఉండటానికి ఈత ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు తొడల భాగంలో కూడా కొవ్వును కరిగిస్తుంది.  
 

click me!