business
పాన్ 2.0 తర్వాత ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలా? పాత పాన్ కార్డు ఏమవుతుంది?
QR కోడ్ ఉన్న పాన్ కార్డు వస్తే ప్రస్తుత పాన్ కార్డు పనిచేయదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.
పాన్ 2.0 ప్రాజెక్ట్ ప్రకారం మీ ప్రస్తుత పాన్ కార్డు చెల్లుబాటులో ఉంటుంది. కొత్త QR కోడ్ పాన్ కార్డు మీ ఈ-మెయిల్‌కే వస్తుంది.
మీకు ఫిజికల్ కార్డు కావాలంటే దరఖాస్తు చేసుకుని రూ.50 చెల్లించాలి.
కొత్త QR కోడ్ పాన్ కార్డుతో గుర్తింపు సులభం అవుతుంది. ఆధార్ కార్డులాగానే QR కోడ్ ఉంటుంది. స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో సులభంగా వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు పాన్ 2.0 కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి పాత కార్డు చెల్లుబాటులో ఉంటుంది.
పాన్ కార్డులో ఏదైనా అప్‌డేట్ చేయాలనుకుంటే కొత్తగా వచ్చే కార్డు 2.0 వెర్షన్‌లో ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు ఉండదు.
PAN, TAN నిర్వహణను ఆధునికీకరించడం, పన్ను చెల్లింపుదారుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడం పాన్ 2.0 ఉద్దేశ్యం.
మీ పిల్లలు కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి
ప్రపంచంలోనే టాప్ 5 రెయిన్ ఫారెస్ట్‌లు ఇవే..
ఇండియాలోని ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు తెలుసా?
లాంచ్‌కి రెడీగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 ఇదే..