Reliance Trendsలో మీరు ఊహించని డిస్కౌంట్లు: బ్లాక్ ఫ్రైడే ప్రత్యేక ఆఫర్లు ఇవిగో

First Published | Nov 27, 2024, 8:22 PM IST

Black Friday సేల్ ఇప్పుడా బాగా ట్రెండీ గా మారింది. చాలా కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ని వేగంగా విక్రయించడానికి ఈ సేల్ టెక్నిక్ ని ఉపయోగిస్తున్నాయి. ఇండియాలో అతిపెద్ద ఫ్యాషన్ డెస్టినేషన్ Reliance Trends కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారులకు డబుల్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఆ ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం రండి. 
 

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న Reliance కంపెనీ Trends ద్వారా ఫ్యాషన్‌ను అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మెట్రో నగరాలు, మినీ మెట్రోలు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా ట్రెండ్స్ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసింది. వినియోగదారులకు ఫేవరెట్ ఫ్యాషన్ షాపింగ్ డెస్టినేషన్‌గా నిలిచింది. 1000కి పైగా నగరాల్లో 2000కు పైగా స్టోర్లతో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఇది 100కిపైగా జాతీయ, అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్‌లతో పాటు 20కి పైగా సొంత బ్రాండ్‌లను కలిగి ఉంది. ఇవి పురుషులు, మహిళలు, పిల్లల అవసరాలను అనుగుణమైన అన్ని రకాల బట్టలు ఇక్కడ అమ్ముతారు. 
 

Reliance తన Trends షాపింగ్ మాల్స్ లో Black Friday ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే ఇచ్చే ఆఫర్లు కాకుండా వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగించడానికి ట్రెండ్స్ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. దీన్ని ఉపయోగించుకుంటే మీరు కొన్న ఐటమ్స్ ధరలో సగం ధర కలిగిన వస్తువులు మీరు ఉచితంగా పొందొచ్చు. 
 


ట్రెండ్స్ స్టోర్స్ ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన, ట్రెండ్‌కు అనుగుణంగా సూపర్ క్వాలిటీతో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తోంది. ఇందులో ట్రెండీ డ్రెస్సులతో పాటు, మొబైల్ యాక్సిసరీస్, షూష్, బెల్టులు, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్లకు అన్ని రకాల బట్టలు ప్రత్యేక ఆఫర్లో అందిస్తోంది. ఇవి అన్ని ప్రాంతాల వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తుండటంతో ట్రెండ్స్ మాల్స్ ఎల్లప్పుడూ కిటకిటలాడుతుంటాయి.
 

ముఖ్యంగా డ్రెస్‌లు, రెడీమేడ్ బట్టలు అన్ని వర్గాల వారికి ఇక్కడ లభిస్తాయి. మహిళలు, పురుషులు, పిల్లల బట్టలు రీజనబుల్ ధరల్లో లభిస్తాయి. ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి ట్రెండ్స్ మాల్స్ లో విక్రయిస్తున్నారు. 

Reliance Trends బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 1, 2024 వరకు జరుగుతుంది. ఈ వీకెండ్ సేల్‌లో రూ.3499కి షాపింగ్ చేస్తే రూ.2000 విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు.

రిలయన్స్ ట్రెండ్స్ కొన్ని సొంత బ్రాండ్‌లను కూడా అందిస్తోంది. అవి అవాస, రియో, ఫిగ్, ఫ్యూషన్, నెట్వర్క్, నెట్ ప్లే, DNMX తదితర సొంత బ్రాండ్లను వినియోగదారులకు అందిస్తోంది.

Latest Videos

click me!