Isha Ambani: 400 ఏళ్లనాటి నిజాం నగలతో ఈషా అంబానీ బ్లవుజు తయారీ, వాటి ధర తెలిస్తే అవాక్కవుతారు

Published : May 06, 2026, 06:17 PM IST

Isha Ambani: ఈషా అంబానీ న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలాలో అందంగా మెరిసింది. ఆమె ధరించినవి నగలు  హైదరాబాద్ నిజాం, మొఘల్ చక్రవర్తులకు చెందిన చారిత్రక ఆభరణాలు. వీటితో భారత వారసత్వాన్ని ఆమె ప్రపంచ వేదికపై ప్రదర్శించారు.

PREV
14
కోట్ల రూపాయల నగలతో ఈషా అంబానీ

ప్రతి ఏటా మే నెలలో అమెరికాలోని న్యూయార్క్‌లో మెట్ గాలా జరుగుతుంది. ఇది ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు తమ స్టైల్‌ను ప్రదర్శిస్తారు. ఈసారి ఈషా అంబానీ భారత ప్రతినిధిగా నిలిచారు. ఫ్యాషన్‌తో పాటు చరిత్ర, వారసత్వాన్ని ఆమె ప్రపంచానికి చూపించారు.

ఈషా కట్టుకున్న చీరను డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించారు. ఇది గోల్డెన్ టిష్యూ సిల్క్ శారీ. ఖరీదు లక్షల రూపాయల్లో ఉంటుంది. అయితే ఆమె వేసకున్న బ్లవుజు గురించే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బ్లౌజ్‌ను పూర్తిగా ఆభరణాలతో అలంకరించారు. దీనికి హైదరాబాద్ నిజాంకు చెందిన అసలైన 'సర్పేచ్' (తలపాగాకు పెట్టుకునే ఆభరణం) అమర్చారు.

24
వజ్రాభరణాలతో ఖరీదైన బ్లౌజ్
ఈషా అంబానీ దాదాపు 1,800 క్యారెట్ల వజ్రాభరణాలతో ధగధగలాడారు. ఒకప్పుడు హైదరాబాద్ నిజాంల తలపాగాను అలంకరించిన ఈ అరుదైన చారిత్రక ఆభరణాన్ని, ఈషా తన బ్లౌజ్ వెనుక బ్రూచ్‌గా ధరించారు. నీతా అంబానీ వ్యక్తిగత కలెక్షన్ నుంచి తీసుకున్న ఈ 'సర్పేచ్' పచ్చలు, వజ్రాలు, కుందన్ పనితనంతో అద్భుతంగా ఉంది.
34
చక్రవర్తి షాజహాన్ బ్రేస్‌లెట్

మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన బ్రేస్ లెట్ ఈషా అంబానీ దగ్గరఉంది. 17వ శతాబ్దానికి చెందిన ఈ బ్రేస్‌లెట్‌లో వజ్రాలు, కెంపులు, స్పినెల్స్ పొదిగి ఉంటుంది. దాదాపు 400 ఏళ్ల నాటి దీని విలువ 2 బిలియన్ డాలర్లకు పైమాటే. అంటే రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. దాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆమె ధరించారు.

44
1,200 గంటలు కష్టపడ్డారు

ఈషా అంబానీ బ్లౌజ్ సిద్ధం చేసేందుకు 50 మంది కళాకారులు 1,200 గంటల పాటు పనిచేశారు. 1953లో బరోడా మహారాణి సీతా దేవి తన విలువైన పచ్చలు, వజ్రాలను అమెరికన్ జ్యువెలరీ వ్యాపారి హ్యారీ విన్‌స్టన్‌కు అమ్మేశారు. ఈ వజ్రాలు ఆమె కాలి పట్టీలలో ఉండేవి. హ్యారీ విన్‌స్టన్ ఆ పట్టీలను తీసి, వాటితో ఒక అద్భుతమైన నెక్లెస్‌ను తయారు చేశారు. 1957లో న్యూయార్క్‌లో జరిగిన పార్టీలో వాలిస్ సింప్సన్ ఆ హారాన్ని ధరించారు. ఇప్పుడు అదే హారాన్ని ఈషా ధరించారు. అంటే అంబానీ కుటుంబం ఆ హారాన్ని అంతకుముందే కొనుగోలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories