Published : May 06, 2026, 04:33 PM ISTUpdated : May 06, 2026, 04:46 PM IST
డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారా..? అయితే కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో మీ బిల్లును సగానికి తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డీ-మార్ట్ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం దాని ధరల విధానమే. ఒకే వస్తువు అనేక బ్రాండ్లలో బయటికంటే తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతుంది... దీంతో కస్టమర్లు తమకు అవసరమైన వస్తువుల్లో నాణ్యమైనది, తక్కువ ధర కలిగినది ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కిరాణా నుంచి బట్టల వరకు అన్నీ ఒకేచోట కొనుక్నుని షాపింగ్ పూర్తిచేసే మరో సౌకర్యం డీమార్ట్ లో ఉంటుంది.
మధ్యతరగతి ప్రజల షాపింగ్ లిస్ట్‌లో డీ-మార్ట్ మొదటి స్థానంలో ఉంటుంది. తక్కువ ధరలు, ఎక్కువ డిస్కౌంట్లతో ప్రతి వస్తువు దొరకడంతో ఇక్కడ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ డీమార్ట్ షాపింగ్ లో ఓ చిన్న సమస్య కూడా ఉంది… ఇక్కడ అనేక వస్తువులు లభిస్తుండటంతో అవసరం లేనివి కూడా కొనేస్తారు. దీంతో రూ.2000 అనుకున్న బడ్జెట్ రూ.5000 అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి.
24
బ్రాండ్స్ జోలికి పోకండి..
పెద్దపెద్ద బ్రాండ్ వస్తువులు డీమార్ట్ లోనూ ఎక్కువ ధరకే దొరుకుతాయి. వీటికి బదులుగా అవే నాణ్యతతో ఉండే తక్కువ ధర వస్తువులు లేదా డీ-మార్ట్ సొంత బ్రాండ్లను ఎంచుకొండి. దీంతో 30% నుంచి 40% వరకు ఆదా చేయవచ్చు. రోజూ వాడే వస్తువుల విషయంలో ఈ మార్పు పెద్ద తేడాను చూపిస్తుంది.
34
ఆఫర్లను వాడుకొండి...
'బై వన్ గెట్ వన్' వంటి ఆఫర్లను సరిగ్గా వాడుకుంటే మీ మొత్తం ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా సబ్బులు, షాంపూలు, పిల్లల వస్తువులపై ఇలాంటి ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడుకొండి.
ఖరీదైన వస్తువులను కంటికి కనిపించేలా మధ్య షెల్ఫ్‌లలో పెడతారు. అదే తక్కువ ధర వస్తువులు పైన లేదా కింద ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి వస్తువులు ఎంపిక చేసుకుంటే మరికొంత డబ్బులు ఆదా చేయొచ్చు.
షాపింగ్‌కు వెళ్లే ముందు కొనాల్సిన వస్తువుల జాబితా రాసుకోవడం చాలా ముఖ్యం. ఈ లిస్ట్ మీ ఖర్చును కంట్రోల్ చేసే కంచెలా పనిచేస్తుంది. షెల్ఫ్‌లలో అందంగా పేర్చిన వస్తువులను చూసి ఆకర్షితులవకుండా, లిస్ట్‌లో ఉన్నవి మాత్రమే కొంటే, అనవసర ఖర్చులు వాటంతటవే తగ్గిపోతాయి.
సింపుల్‌గా చెప్పాలంటే డీమార్ట్ లో వెళ్లేముందే పక్కా ప్లాన్ రెడీ చేసుకోవాలి… అక్కడికి వెళ్లాక దాన్ని అమలుచేయాలి. ఇలా షాపింగ్ చేస్తే రూ.5000 ఖర్చును కూడా రూ.2000-2500 లోపు కంట్రోల్ చేయవచ్చు. తెలివైన షాపింగే అసలైన పొదుపు.