Apple: సాధారణంగా యాపిల్‌ను కట్ చేసి కాసేపు పక్కన పెట్టగానే గోధుమ రంగులోకి మారిపోతుంటుంది. వాటిని తినాలన్నా, పిల్లలకు బాక్సులో పెట్టాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
యాపిల్ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలామంది ప్రతిరోజూ యాపిల్‌ను తినడానికి ఇష్టపడతారు. పిల్లలకు స్నాక్స్‌గా ఇవ్వడం దగ్గరి నుంచి ఆఫీసులకు బాక్సులో తీసుకెళ్లడం వరకు యాపిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే యాపిల్‌ను ముక్కలుగా కోసిన కొద్దిసేపటికే అది గోధుమ రంగులోకి మారుతుంది. నిజానికి యాపిల్ ముక్కలు రంగు మారడం వెనుక ఉన్న కారణం ఏంటి? అలా కాకుండా ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
27
యాపిల్ రంగు ఎందుకు మారుతుంది?
యాపిల్‌ను కోసినప్పుడు దానిలోని పాలీఫెనాల్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి రంగు మారడానికి కారణమవుతుంది. ఈ ప్రక్రియను ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. అందువల్ల యాపిల్ ముక్కలు కొద్దిసేపటికే గోధుమ రంగులోకి మారతాయి. ఇలా రంగు మారినంత మాత్రాన యాపిల్ వెంటనే పాడైపోయిందని అర్థం కాదు. అయితే దాని రూపం, తాజాదనం తగ్గినట్లు కనిపించవచ్చు. అందుకే యాపిల్ ముక్కలను కోసిన తర్వాత సరైన పద్ధతిలో నిల్వ చేయడం మంచిది.
37
నిమ్మరసం ఉపయోగించడం
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్‌పై జరిగే బ్రౌనింగ్ ప్రక్రియను స్లో చేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా చల్లని నీటిని తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. యాపిల్ ముక్కలను ఈ నీటిలో కొద్దిసేపు ఉంచి, ఆ తర్వాత బయటకు తీసి నీటిని తొలగించాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కలు ఎక్కువసేపు తాజాగా కనిపిస్తాయి.
యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండటానికి ఉప్పు నీరు కూడా ఉపయోగపడుతుంది. ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో యాపిల్ ముక్కలను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి శుభ్రమైన నీటితో లైట్ గా కడగాలి.
57
తేనె కలిపిన నీటితో..
ఒక కప్పు నీటిలో ఒకటి నుంచి రెండు టీస్పూన్ల తేనె కలిపి, అందులో యాపిల్ ముక్కలను కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. తేనెలో ఉండే కొన్ని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు బ్రౌనింగ్ ప్రక్రియను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ పద్ధతిలో యాపిల్‌కు అదనపు చక్కెర చేరుతుందనే విషయం మర్చిపోవద్దు.
67
చల్లని నీటిని ఉపయోగించడం
యాపిల్ ముక్కలను కొద్దిసేపు చల్లని నీటిలో ఉంచడం ద్వారా రంగు మారే వేగం తగ్గవచ్చు. అయితే నీటిలో ఉంచడం ఒక్కటే బ్రౌనింగ్‌ను పూర్తిగా ఆపదు. యాపిల్ ముక్కలను నీటిలో కాసేపు ఉంచి తర్వాత బయటకు తీసి శుభ్రమైన పాత్రలో నిల్వ చేయడం మంచిది.
77
గాలి చొరబడని డబ్బాలో..
యాపిల్ ముక్కలను కోసిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో పెట్టడం మంచిది. గాలితో సంబంధం తగ్గడం వల్ల యాపిల్ రంగు మారే ప్రక్రియ నెమ్మదిస్తుంది. వీలైతే ముక్కలను శుభ్రమైన, మూత బిగుతుగా ఉండే డబ్బాలో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. లేదంటే యాపిల్ ని తినేముందు కట్ చేసుకోవడం ఉత్తమం.