Organizer Rack : బడ్జెట్ ఫ్రెండ్లీ మల్టీ యూజ్ ఆర్గనైజర్ ర్యాక్.. ఇదొక్కటి చాలు ఈజీగా సర్దేయొచ్చు

Published : Oct 12, 2026, 03:05 PM IST

Organizer Rack: డెస్క్ ఆర్గనైజర్లు చూసే ఉంటాం. వైర్లు చిక్కుకుపోకుండా ఒకే దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ ఇది మాత్రం మల్టీ టాస్కింగ్ టూల్. కిచెన్, లివింగ్ రూంలోనూ యూజ్ అవుతుంది. మేకులు కొట్టక్కర్లేదు. కంఫర్ట్ ఉంటుంది. బడ్జెట్ లో దొరికేస్తుంది.

PREV
15
మల్టీ టాస్కింగ్ టూల్

వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు, ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చున్నా.. చార్జర్లు, పవర్ బ్యాంక్, అడాప్టర్లు, మిగతా కేబుల్స్ చుట్టూ చిందరవందరగా కనిపిస్తుంటాయి. చిక్కుకుపోయి ఉంటాయి. వాటిని తీయాలంటే చికాకు పుడుతుంది. ఒక్కోసారి వైర్లు కాళ్లల్లో ఇరుక్కుంటాయి. మీలో ఎవరైనా ఈ సమస్య ఫేస్ చేస్తుంటే ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది.కేవలం రూ.1000 లోపే దొరికేస్తుంది.

25
వైర్లు చిక్కుకోకుండా ఉంటాయి

ఈ కేబుల్ ఆర్గనైజర్‌ను డెస్క్ కింద అమర్చుకోవచ్చు. పవర్ స్ట్రిప్స్, చార్జర్లు, అడాప్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన వైర్లను ఇందులో సర్దుకోవచ్చు. దీంతో డెస్క్‌పై వైర్లు చెల్లాచెదురుగా కనిపించకుండా, వర్క్‌స్పేస్ నీట్‌గా ఉంటుంది. కంప్యూటర్ టేబుల్, వర్క్ ఫ్రం హోం డెస్క్ దగ్గర దీన్ని ఉపయోగించుకోవచ్చు. వైర్లు అన్నీ కలిసిపోకుండా ఒకే దగ్గర నీట్ గా ఉంటాయి.

35
కిచెన్ లోనూ వాడుకోవచ్చు

అంతేకాదు..ఈ ఆర్గనైజర్ ర్యాక్ కోసం ప్రత్యేకంగా మేకులు, నట్లు కొట్లాల్సిన పని లేదు. గమ్ వాడక్కర్లేదు. ఎక్కడైనా ఈజీగా పెట్టుకోవచ్చు. కిచెన్ లో రోజూ వాడుకునే పోపు డబ్బాలు, ఉప్పు, కారాలు, మసాలాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పుస్తకాలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మినీ లైబ్రరీ లాగా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఏవైనా మనకు అందుబాటులో ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

45
ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు

అంతేకాదు వర్క్ చేస్తున్నప్పుడు పదే పదే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు దీంతో పాటు ఇచ్చిన ఫోన్ స్టాండ్ యూజ్ అవుతుంది. ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి అనే ఆలోచన లేకుండా ఈజీగా అక్కడే పెట్టుకోవచ్చు. టేబుల్ ని కింద ఇచ్చిన రింగ్..పైన ఇచ్చిన స్టాండ్ కి మధ్య పెట్టుకుని బిగిస్తే సరి. దీని కోసం మేకులు పెట్టాల్సిన పనిలేదు. సో ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

55
బడ్జెట్ లోనే దొరికేసే ఆర్గనైజర్ ర్యాక్

ఈ ఒక్క ఆర్గనైజర్ ర్యాక్ వల్ల మల్టీ పర్పజ్ వాడుకోవచ్చు. గమ్ వాడక్కర్లేదు. డ్రిల్లింగ్ చేయక్కర్లేదు. నేల మీద గీతలు కూడా పడవు. దీని కెపాసిటీ ఎక్కువగానే ఉంటుంది. దీని కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు. రూ.వెయ్యి కే దొరికేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories