13
మిగిలిన పిండితో గుంత పొంగనాలు రెసిపీ
కావాల్సిన పదార్థాలు: దోశ పిండి – 1 కప్పు
రవ్వ – 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 1
తురిమిన అల్లం – ½ టీస్పూన్
తరిగిన కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం: ఒక గిన్నెలో దోశ పిండి, రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కానీ, పొంగనాల పెనంలో వేసేటప్పుడు పిండి మరీ పల్చగా ఉండకూడదు. పొంగనాల పెనం వేడి చేసి, ప్రతి గుంటలో కొద్దిగా నూనె వేయాలి. గుంటలో ముప్పావు వంతు వరకు పిండి వేసి, మంటను మీడియంలో పెట్టి మూతపెట్టి ఉడికించాలి. అడుగు భాగం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే, తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. Subscribe to get breaking news alertsSubscribe 23
వెజిటబుల్ పాన్ కేక్
కావాల్సిన పదార్థాలు: దోశ పిండి – 1 కప్పు
తురిమిన క్యారెట్ – ¼ కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ – ½
సన్నగా తరిగిన క్యాప్సికమ్ – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – ¼ టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం: దోశ పిండిలో తురిమిన క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. దోశ పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. ఒక చిన్న గరిటెడు పిండి తీసుకుని, పల్చటి దోశలా కాకుండా కాస్త మందంగా గుండ్రంగా పోసుకోవాలి. మంటను మీడియంలో పెట్టి మూతపెట్టి ఉడికించాలి. అడుగు భాగం బాగా ఉడికాక, తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. 33
శాండ్ విచ్
కావాల్సిన పదార్థాలు: దోశ పిండి – 1 కప్పు
ఉడికించి మెదిపిన బంగాళదుంప – 1
సన్నగా తరిగిన ఉల్లిపాయ – ½
పసుపు – చిటికెడు
కారం – ¼ టీస్పూన్
జీలకర్ర – ¼ టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం: ఒక గిన్నెలో మెదిపిన బంగాళదుంప, ఉల్లిపాయ, పసుపు, కారం, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలపాలి. దోశ పెనం మీద చిన్నవిగా, కాస్త మందంగా దోశలు పోసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక దోశ మీద తయారు చేసుకున్న బంగాళదుంప మసాలాను సమానంగా పరచాలి. దాని మీద మరో దోశను ఉంచి తేలికగా నొక్కాలి. మళ్లీ దోశ పెనం మీద పెట్టి రెండు వైపులా కొద్దిగా నూనె రాసి, బయట కరకరలాడే వరకు కాల్చుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.