Banana Dosa: పిల్లలు అరటిపండ్లు తినడం లేదా? అయితే క్రేజీగా ఈ రెడ్ బనానా దోశె ట్రై చేయండి

Published : Nov 28, 2026, 05:16 PM IST

Banana Dosa: పిల్లలు అరటిపండ్లు తినడం లేదా? అయితే ఒకసారి ఇలా రెడ్ బనానా దోశె ట్రై చేయండి. అప్పుడు రెగ్యులర్ గా తినే దోశెకు డిఫరెంట్ గానూ ఉంటుంది. అయితే పిల్లలకు నచ్చేలా టేస్టీగా దోశ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. దీనిని ఈవినింగ్ స్నాక్స్‌గా తినవచ్చు.

PREV
16
పాన్ కేక్స్..

రోజూ ఒకే రకమైన దోశలు తిని బోర్ కొట్టిన వాళ్లకు ఈ ఎర్ర అరటిపండు తీపి దోశ ఒక హెల్తీ, టేస్టీ ఆప్షన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చేలా దీని రుచి అద్భుతంగా ఉంటుంది. వీటిని పాన్ కేక్స్ అని కూడా అనొచ్చు

26
కావలసిన పదార్థాలు

ఎర్ర అరటిపండు

బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండి

ఎర్ర అటుకులు

పెరుగు

నాటు చక్కెర లేదా బెల్లం పొడి

యాలకుల పొడి

పసుపు

వంట సోడా

నెయ్యి

నీళ్లు

36
స్టెప్ 1

ముందుగా ఒక మిక్సీ జార్‌లో తొక్క తీసిన రెండు ఎర్ర అరటిపండ్లు, ముప్పావు కప్పు రవ్వ లేదా బియ్యం పిండి, ముప్పావు కప్పు ఎర్ర అటుకులు, ముప్పావు కప్పు పెరుగు వేయండి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.

46
స్టెప్ 2

గ్రైండ్ చేసిన మిశ్రమంలో పావు కప్పు నాటు చక్కెర, కొద్దిగా యాలకుల పొడి, తగినన్ని నీళ్లు పోసి దోశ పిండి లాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ పిండిలో అర టీస్పూన్ పసుపు, చిటికెడు వంట సోడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.

56
స్టెప్ 3

దోశ పెనాన్ని పొయ్యి మీద పెట్టి మీడియం మంటపై వేడి చేయండి. పెనం మీద ఒక గరిటె పిండిని పోసి, ఎక్కువగా రుద్దకుండా తేలికగా స్ప్రెడ్ చేయండి. దోశ చుట్టూ ఒక టీస్పూన్ నెయ్యి వేసి, మూత పెట్టి తక్కువ మంట మీద ఒక నిమిషం ఉడకనివ్వండి. ఒక నిమిషం తర్వాత మూత తీసి దోశను తిరగేసి, రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా, కొంచెం క్రిస్పీగా కాలే వరకు ఉంచి తీస్తే, ఎంతో రుచికరమైన ఎర్ర అరటిపండు స్వీట్ దోశ రెడీ.

66
హెల్తీ దోశ

సాధారణంగా ఇంట్లో అరటిపండ్లు బాగా పండిపోయి తొక్క కొద్దిగా నల్లబడితే ఎవరూ తినడానికి ఇష్టపడరు. అలా పండిన పండ్లను పడేయకుండా, వాటితో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ దోశ లేదా గుంట పొంగడాలు చేసుకోవచ్చు. మామూలు అరటిపండ్లకు బదులుగా ఎర్ర అరటి లేదా నేంద్రం పండును ఉపయోగించినప్పుడు, ఈ దోశ పోషకాలు, రుచి కూడా ఎన్నో రెట్లు పెరుగుతాయి. సాయంత్రం స్నాక్స్‌గా లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా పిల్లలకు చేసి ఇవ్వడానికి ఇది బెస్ట్ అండ్ హెల్తీ ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories