Sweet Corn Vs Desi Corn: స్వీట్ కార్న్, సాధారణ మొక్కజొన్న.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

Published : Nov 28, 2026, 03:42 PM IST

Sweet Corn Vs Desi Corn: మొక్కజొన్న ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, స్వీట్ కార్న్ లేదా.. నార్మల్ దేశీ మొక్కజొన్న రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మంచిది? దేనిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి?

PREV
13
ఏది తినాలి?

హెల్దీ స్నాక్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మొక్కజొన్న. కొందరికి బొగ్గుల మీద కాల్చే మొక్కజొన్న తినడం నచ్చుతుంది. మరికొందరికి.. ఉడకపెట్టిన స్వీట్ కార్న్ తినడం నచ్చుతుంది. రుచిలో ఈ రెండింటికీ తిరుగులేదు. అయితే.. చాలా మందికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ మంచిది? ఆరోగ్యంగా ఉండటానికి ఏది తీసుకోవడం ఉత్తమం అనే అనుమానం ఉంటుంది. మరి, పోషకాల పరంగా ఏది తీసుకోవడం ఉత్తమం అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....

23
స్వీట్ కార్న్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు. అంతేకాదు.. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది.దీంతో.. ఇతర జంక్ ఫుడ్ తినాలనే కోరిక ఉండదు. ఎక్కువ తినే సమస్య తక్కువగా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. స్వీట్ కార్న్‌లో ఉండే లుటీన్, జియాక్శాంటిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

33
దేశీ మొక్కజొన్నతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

దేశీ మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి దీర్ఘకాలిక సమస్యల ముప్పును తగ్గిస్తాయి. ఇందులో విటమిన్-సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వాపులు, ఇతర సమస్యలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

రెండింటిలో ఏది తినడం ఉత్తమం..?

ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, ఆరోగ్యం పరంగా... దేశీ మొక్కజొన్న ను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇందులో షుగర్ తక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి దేశీ మొక్కజొన్న బెస్ట్ ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories