మనకు ఇంట్లో, బాత్రూమ్ లో ప్రస్తుతం ఎవరికైనా ట్యాప్స్ ఉంటున్నాయి. వీటిని మొదట ఫిక్స్ చేసినప్పుడు బాగానే ఉంటాయి. కానీ.. వాడగా,వాడగా... రిపేర్లు రావడం మొదలౌతాయి. ఎక్కువగా... ట్యాప్స్ లీక్ అయ్యి.. వాటర్ ఎక్కువగా వృథా అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు బాత్రూమ్ షవర్స్ కూడా ఇలా వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. కొత్త ట్యాప్స్ ఫిక్స్ చేయకుండా... ఈ వాటర్ లీకేజీని ఎలా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం...
బాత్రూమ్ ని యూఎస్ చేసిన ప్రతిసారీ... ఈ ట్యాప్స్ కదిలించడం అవి వాటర్ కారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా , చాలా సార్లు, మీరు టాయిలెట్ హ్యాండ్ జెట్ షవర్‌ని నొక్కినప్పుడు, మీరు నొక్కిన చోట నుండి హ్యాండిల్ నుండి నీరు రావడం మొదలౌతుంది. హ్యాండ్ జెట్ షవర్ లోపల ఏదైనా పదేపదే ఒత్తిడి కారణంగా దాని స్థానం నుండి తరలించబడినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది.