సరికొత్త ఫీచర్లతో మళ్లీ టాటా సుమో వచ్చేస్తోంది..: తక్కువ ధర, ఎక్కువ మైలేజ్!

First Published | Nov 26, 2024, 6:07 PM IST

టాటా కొత్త సుమో గోల్డ్ కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారు ఎక్కువ మైలేజ్, కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తుంది. సుమో గోల్డ్ జీఎక్స్ బీఎస్ 4 వేరియంట్‌లో టాప్ మోడల్‌గా లభిస్తుంది.

కొత్త టాటా సుమో

తక్కువ ధర కార్లకు ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. చాలా కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ పోటీలో టాటా కూడా కొత్త సుమో గోల్డ్ ఎడిషన్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కార్ల ప్రియులు ఈ కారు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాటా సుమో గోల్డ్ జీఎక్స్ ధర

టాటా సుమో భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు కొత్త అర్థం చెప్పింది. వ్యక్తిగత వాడకం నుంచి ఆసుపత్రి, స్కూల్ వాహనాల వరకు సుమో చాలా కాలంపాటు రోడ్లపై రాజ్యమేలింది. తాజాగా మరోసారి కొత్త మోడల్ మార్కెట్ లోకి వస్తోంది. కొత్త సుమో గోల్డ్ జీఎక్స్ బీఎస్ 4 వేరియంట్‌లో టాప్ మోడల్. సుమో గోల్డ్ టాప్ మోడల్ ధర రూ.8.93 లక్షలు. లీటరుకు 15.3 కి.మీ మైలేజ్ ఇస్తుంది.


టాటా సుమో గోల్డ్ జీఎక్స్

సుమో గోల్డ్ బీఎస్-4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. రెండు రంగుల్లో వస్తుంది - ప్లాటినం సిల్వర్, సిరామిక్ వైట్. సుమో గోల్డ్‌లో 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉంటాయి. 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

టాటా సుమో గోల్డ్ మైలేజ్

కొత్త టాటా సుమో గోల్డ్‌లో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మంచి సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. 1990లలో టాటా సుమో రోడ్లపై పరుగులు తీసినప్పుడు దాని పేరు జపాన్‌తో ముడిపడింది. జపాన్‌లో సుమో అంటే రెజ్లింగ్ అని అర్థం.  

టాటా సుమో గోల్డ్ లాంచ్

టాటా సుమో కారుకు టాటా మాజీ ఉద్యోగి సుమంత్ ముల్గావ్‌కర్ పేరు పెట్టారు. టాటా ఎండీగా పనిచేసిన సుమంత్ పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. టాటా సుమో రూపకల్పన వెనుక సుమంత్ ఉన్నారు.

Latest Videos

click me!