అమెరికా వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం, బాగా ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్ లో వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. గుడ్డును ఉడకపెట్టినప్పుడు దానిపై ఉండే సహజ రక్షణ పొర తొలగిపోతుంది. అందుకే, ఉడికించిన గుడ్డు పైన షెల్ తొలగించినా, తొలగించకపోయినా కూడా.. పాడవ్వకుండా ఉండాలంటే, బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే కచ్చితంగా ఫ్రిజ్ లోనే స్టోర్ చేయాలి.
ఫ్రిజ్ లో ఎలా స్టోర్ చేయాలి..?
పెంకు ఉన్న గుడ్లు : గుడ్డు పెంకు ఇతర వాసనలు, మలినాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. వీటిని శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో (Airtight container) పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
పెంకు తీసిన గుడ్లు : పెంకు తీసిన గుడ్లు ఎండిపోకుండా ఉండాలంటే, డబ్బాలో ఒక తడి పేపర్ టవల్ ఉంచి దానిలో వీటిని నిల్వ చేయాలి. లేదా శుభ్రమైన చల్లటి నీటిలో ముంచి ఉంచి, రోజూ నీటిని మారుస్తుంటే వారం రోజులు తాజాగా ఉంటాయి.