వేళ్లు విరిచే వారిికి 'ఆస్టియో ఆర్థరైటిస్' (Osteoarthritis) అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వయసు, అధిక బరువు, జన్యుపరమైన కారణాలు, కీళ్లకు తగిలిన గాయాలు వంటి అనేక అంశాల వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. వేళ్లు విరవడం అనేది దీనికి ప్రధాన కారణమని చెప్పలేము.
వేళ్లు విరవడం సాధారణ విషయమే. అయితే మెడ లేదా వీపును బలవంతంగా విరవడం మాత్రం చాలా ప్రమాదకరం. మెడ భాగంలో వెన్నుపాము, ముఖ్యమైన నరాలు, మెదడుకు వెళ్లే రక్తనాళాలు ఉంటాయి. అక్కడ సొంతంగా ఒత్తిడి ప్రయోగిస్తే గాయాలు కావచ్చు. కాబట్టి, వేళ్ల విషయంలో చెప్పిన లాజిక్‌ను మెడ, వీపు విషయంలో ఉపయోగించకూడదు. ఒకవేళ వేళ్లు విరిచినప్పుడు శబ్దంతో పాటు నొప్పి, వాపు, వేళ్లను మడవలేని పరిస్థితి ఉంటే మాత్రం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. వేళ్లను విరవడం మానేయాలి.