స్టవ్ మీద ఒక నాన్‌స్టిక్ పాన్ పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయండి.
మెత్తబడిన అన్నాన్ని అందులో వేసి సన్నని మంటపై 3-4 నిమిషాలు మెల్లగా కలపండి.
దీనివల్ల తేమ పోవడమే కాకుండా అన్నం మంచి సువాసనతో, పొడిపొడిగా తయారవుతుంది.
మరో చిట్కా: అన్నం మరీ మెత్తగా అయిపోతే .. దానిని విసిరిపారేయకుండా చిత్రాన్నం (నిమ్మకాయ పులిహోర), పెరుగు అన్నం, రసం అన్నం, లేదా వడలు/దోశల పిండిలో ఉపయోగించుకోవచ్చు.
ఇలా మాత్రం చేయకూడదు..
మెత్తగా అయిన అన్నాన్ని సరిచేయడానికి మళ్లీ నీళ్లు పోసి ఉడికించడం లేదా గట్టిగా కలపడం చేయకండి. దాంతో అన్నం మరింత జిగురుగా మారుతుంది.