దీనితో పంటి నొప్పి వెంటనే తగ్గుతుంది

Published : Sep 02, 2025, 02:41 PM IST

పంటి నొప్పి చాలా మందికి వస్తుంది. ఇది సర్వ సాధారణ సమస్యే అయినా ఇది గంటల తరబడి ఉంటుంది. ఈ సమయంలో ఏ పనులూ చేయలేం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ పంటి నొప్పిని వెంటనే తగ్గించుకోవచ్చు. 

PREV
14
పంటి నొప్పి

పంటి నొప్పి చిన్న సమస్యే అయినా ఇది బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ పంటి నొప్పి వచ్చిందంటే గంటల తరబడీ ఉంటుంది. దీనివల్ల ఏ పనీచేయలేం. దీన్ని మెడిసిన్ తో వెంటనే తగ్గించుకోవచ్చు. మరి అకస్మత్తుగా పంటి నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
ఉప్పు నీళ్లు

పుచ్చిపోయిన  పళ్లు ఉన్నవారికి పంటి నొప్పి రావడం సర్వ సాధారణం. అయితే ఈ నొప్పి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ పంటి నొప్పిని తగ్గించడానికి ఉప్పు నీళ్లు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇది చాలా సింపుల్ చిట్కా. దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. పంటి నొప్పి మరీ ఎక్కువైనప్పుడు ఉప్పు కలిపిన నీళ్లతో పుక్కిలించండి. నోటిని కడగండి. దీనివల్ల పంటిలోని పురుగులు నశిస్తాయి. అలాగే మీ నోరు, చిగుళ్లు ఆరోగ్యంగానూ ఉంటాయి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

34
వెల్లుల్లి

ప్రతి వంటింట్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. నిపుణుల ప్రకారం.. ఈ వెల్లుల్లిని ఉపయోగించి కూడా మనం పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. దీనిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మీకు పంటి నొప్పి ఎక్కువైతే వెల్లుల్లి పేస్ట్ ను పళ్లపై పెట్టండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది.

44
లవంగం నూనె

పంటినొప్పికి లవంగం నూనెను ఎన్నో ఏండ్ల నుంచి వాడుతున్నారు. ఇది చాలా తక్కువ టైంలోనే పంటినొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి నొప్పిని వెంటనే తగ్గించుకోవడానికి మీరు లవంగం నూనెను ఉపయోగించొచ్చు. పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ నూనెలో కాటన్ ను ముంచి దంతాలపై పెట్టండి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పంటి నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ కలిగిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories