September Born: సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు ఎలాంటి ఉద్యోగాల్లో రాణిస్తారంటే..

Published : Sep 02, 2025, 12:19 PM IST

సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఈ నెలలో పుట్టిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. నెలను బట్టి కూడా వారి భవిష్యత్తును అంచనా వేసి చెప్పవచ్చని వివరిస్తోంది జ్యోతిష్య శాస్త్రం. 

PREV
15
సెప్టెంబర్ నెల

సెప్టెంబర్ నెలలో పుట్టిన రోజులు చేసుకునేందుకు ఎంతోమంది సిద్ధమైపోయి ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు స్వభావం లక్షణాలు, వారి భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి వివరిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం మీరు కూడా సెప్టెంబర్ నెలలోనే పుట్టి ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

25
ఎలాంటి లక్షణాలు?

సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ, పురుషులు కష్టపడి పనిచేసేవారు వారు. కృషిని నమ్ముకుని ముందుకు వెళతారు. ఏ విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. వీరు చాలా చురుగ్గా ఉంటారు. వీరికి చేసే పనుల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే వీరి జీవితం కూడా మంచిగానే ఉంటుంది.

35
కెరీర్ ఎలా ఉంటుంది?

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. అంటే ఎవరినైనా కూడా తమ మాటలతో కట్టిపడేయగలరు. అందుకే వీరికి ఉత్తమమైన ఉద్యోగం లాయర్లు. మీరు లాయర్లుగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లాయర్లతో పాటు టీచర్లు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలుగా కూడా వీరు ఎదిగే అవకాశం ఉంది. ఇక సొంత విషయాలలో ఎవరి సలహాలను అడగరు. తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే వీరి బాల్యం, జీవితం, యవ్వనంలో ఎక్కువగా కష్టాలు, శ్రమ ఉంటుంది. ఇక వీరి ప్రేమ జీవితం, కుటుంబ జీవితం అంతగా బాగుండే అవకాశం ఉండదు.

45
చెడు స్నేహాలు వద్దు

వీరికి ఉండే అలవాట్లు అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ మధ్యలో చెడు స్నేహాల వల్ల చెడు అలవాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. జీవితాంతం మీరు ఆరోగ్యం బాగానే ఉంటుంది. వీరి శరీర సౌష్టవం కూడా బాగుంటుంది. అలాగే ఆహారం విషయంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. రుచులు కూడా భిన్నంగా ఉంటాయి.

55
ఆరోగ్యం ఎలా ఉంటుంది?

ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వీరికి త్వరగా మానసిక పరమైన ఇబ్బందులు వస్తాయి. అలాగే మీరు త్వరగా మానసికంగా గాయపడతారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఊపిరితిత్తులకు, భుజాలకు, చేతులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జ్వరం త్వరగా వస్తుంది. చర్మవ్యాధులు కూడా రావచ్చు. సెప్టెంబర్ నెలలో పుట్టే వారికి కోపం అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరిపై అంగారకుడి ప్రభావం ఎక్కువ. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి బుధవారం, శనివారం కలిసి వస్తాయి. ఇక ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు వీరికి నప్పుతాయి. ఏవైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది. అలాగే వీరికి వజ్రం కలిసి వచ్చే రాయి.

Read more Photos on
click me!

Recommended Stories