ఎక్కిళ్లు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇవి రెండు మూడు నిమిషాల్లోనే ఆగిపోతుంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎక్కిళ్లు చాలా సేపటివరకు అలాగే వస్తూనే ఉంటాయి. కానీ నలుగురిలో ఎక్కిళ్లు వస్తే మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎక్కిళ్లను ఆపడానికి నీళ్లను తాగుతుంటారు. అయినా ఎక్కిళ్లు తగ్గవు. ఇలాంటి సమయంలో ఎక్కిళ్లు వెంటనే తగ్గడానికి ఏమేమి చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పెరుగు, ఉప్పు
పెరుగు, ఉప్పుతో కూడా ఎక్కిళ్లను చాలా ఫాస్ట్ గా తగ్గించుకోవచ్చు. ఎక్కిళ్లు ఎంతకీ తగ్గనప్పుడు మీరు పెరుగును ఉప్పుతో కలిపి తినండి. వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి. పెరుగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుది.
మీ శ్వాసను పట్టుకోండి
ఎక్కిళ్లను ఆపడానికి ఇది కూడా బెస్ట్ టిప్. ఎక్కిళ్లు వచ్చినప్పుడు మీ శ్వాసను కొన్ని సెకన్ల పాటు పట్టుకోవడం వల్ల కూడా ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. కానీ శ్వాసను చాలా సేపటి వరకు పట్టి ఉంచకూడదు.
నాలుకను బయటకు తీయండి
ఎక్కిళ్లు తగ్గిపోవడానికి నాలుకను బయటకు తీస్తే కూడా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవును ఎక్కిళ్లు వస్తున్నప్పుడు మీరు మీ నాలుకను కాసేపు బయటకు తీసి, మీ వేలితో నాలుక చివరను పట్టుకొని వదలండి. తిరిగి నాలుకను లోపలకు తీసుకోండి. దీని వల్ల ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి.
నీళ్లు
చాలా మందికి తినేటప్పుడు కూడా ఎక్కిళ్లు బాగా వస్తుంటాయి. ఇలాంటప్పుడు మీరు ఎక్కిళ్లను తగ్గించుకోవడానికి ముక్కు మూసుకుని శ్వాసను పట్టుకుని నీళ్లు తాగితే సరిపోతుంది. దీనివల్ల కూడా ఎక్కిళ్లు తొందరగా తగ్గిపోతాయి.
దృష్టి మార్చండి
మీరు మీ దృష్టినంతా ఎక్కిళ్లపైనే ఉంచితే కూడా అవి తొందరగా తగ్గవు. అందుకే ఇలాంటి సమయంలో మీరు మరొకదానిపై దృష్టి పెట్టండి. దీంతో ఎక్కిళ్లు తొందరగా తగ్గిపోతాయి. ఈ పద్దతిలో కూడా ఎక్కిళ్లు ఫాస్ట్ గా తగ్గిపోతాయి.
నిమ్మకాయ
నిమ్మకాయ కూడా ఎక్కిళ్లను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుండి. అందుకే ఎక్కిళ్లు వచ్చినప్పుడు నిమ్మకాయ ముక్కను కట్ చేసి నోట్లో పెట్టుకోండి. వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.