ఇటు సినిమాల విషయంలో కాని.. అటు రాజకీయంగా కాని తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హీరోగా, ఎమ్మెల్యేగా.. హ్యాట్రిక్ కొట్టి.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేశాడు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడో సారి అఖండ విజయం అందుకున్నారు బాలకృష్ణ.
ఇటు హీరోగా కూడా మూడు సినిమాలు వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ విన్నర్ గా నిలిచారు. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఓసినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు డాకు మహరాజ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.
మెగా డైరెక్టర్ గా పేరు పడిన బాబీ.. బాలయ్యను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా తరువాత వరుస సినిమాలను ఆయన లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. అందులో బోయపాటి శ్రీనుతో అఖండ2 ను ఆల్ రెడీ అనౌన్స్ చేసేశారు. మరికొన్ని కథలు బాలకృష్ణ హోల్డ్ చేసి పెట్టినట్టు సమాచారం.