బ్లీచింగ్ మీ ముఖ సౌందర్యానికి మరింత వన్నె తెస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. ముఖానికి వాడే ఫేస్ బ్లీచ్ ఒక రసాయన పదార్థం. దీంట్లో ఉంటే ముఖ్యమైన సమ్మేళనం హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇదే ముఖాన్ని బ్లీచింగ్ చేయడానికి సాయపడుతుంది. సాధారణంగా ఫేస్ బ్లీచింగ్ అంటే ముఖం మీద ఉండే వెంట్రుకల్ని రంగు తగ్గించడం వల్ల.. ముఖం మునుపటి కంటే కాంతివంతంగా, అందంగా తయారవుతుంది.
ఇది మొహానికి ఏం చేస్తుంది.. అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మొహంమీది వెంట్రుకల్ని రంగు తగ్గేలా చేస్తుంది. దీనివల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖం మీది నలుపు విరిగిపోతుంది. అందంగా మెరిసే చర్మంతో కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం చేసే ప్రయత్నాల్లో బ్లీచింగ్ కూడా ఓ భాగమే.

అందుకే మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల్లో భాగంగా.. అనేక రకాల బ్లీచింగ్స్ దొరుకుతున్నాయి. అయితే బ్లీచింగ్ ముఖాన్ని మెరిపిస్తుందని తరచుగా వాడడం అంత మంచిది కాదు. ఎప్పుడో ఓ సారి మంచిదే కానీ.. అతిగా వాడడం వల్ల మొదటికే మోసం వస్తుంది. చర్మం మీద దురదలు పుట్టిస్తుంది. దీనివల్ల ఎర్రని దద్దుర్లు వస్తాయి. అందుకే రసాయనాలు కలిసిన బ్లీచ్ లకంటే సహజసిద్ధమైన బ్లీచ్ లు వాడడం మంచిది.
మరెలా? దీన్నుంచి తప్పించుకోవడం ఎలా? బ్లీచ్ వాడకుండా మొహాన్ని మెరిపించే సాధనాలు ఉన్నాయా? అంటే ఉన్నాయి. సహజ సిద్దమైన బ్లీచ్ ను మీరే ఇంట్లో స్వయంగా తయారు చేసుకోవచ్చు. దీంతో నలుగురిలో అందంగా మెరిసిపోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఎలా చేయాలో తెలుసుకుని దాన్ని ఫాలో అవ్వడమే.
ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకోవాంటే ఏం కావాలో ఓ సారి చూద్దాం. పాలు, తేనె, నిమ్మకాయతో ఇంట్లోనే చర్మానికి ఎలాంటి హాని కలిగించని బ్లీచ్ ను తయారు చేసుకోవచ్చు. దీనికోసం నాలుగు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి.
ఈ బ్లీచ్ ను ఎలా తయారు చేయాలంటే..పాలు, తేనె, నిమ్మరసం.. మూడింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలిసి మొహానికి పట్టించండి. ముఖం మీద టాన్ అయిన ప్లేస్ లో కూడా అంటేలా చూసుకోండి. ఒకదగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా మొత్తం ఒకేలా అంటేలా చూసుకోండి. పదిహేను నిమిషాల పాటు ఉంచండి. ఆరిపోయాక, చల్లటి నీటితో కడిగేయండి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయవచ్చు.