ముఖానికి, దుస్తులకు హోలీ రంగులు పోవాలంటే ఇలా చేయండి

First Published | Mar 22, 2024, 1:13 PM IST

హోలీ నాడు రకరకాల కలర్స్ ను జల్లుకుంటారు. ఇవి ముఖానికి, బట్టకు బాగా అంటుకుంటాయి. కానీ ఈ రంగులు అంత సులువుగా పోవు. ఎందుకంటే వీటిలో కెమికల్స్ ఉంటాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే ఒంటికి, దుస్తులకు అంటుకున్న హోలీ రంగులను సులువుగా పోగొట్టొచ్చు. 
 

హోలీ పండును దేశవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులతో  ఆడుకుంటారు. కానీ హోలీకి కెమికల్స్ రంగులు కాకుండా నేచురల్ కలర్స్ ను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే మనం ఉపయోగించే కెమికల్స్ రంగులు చర్మాన్నిదెబ్బతీస్తాయి. అంటే వీటివల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. చర్మం ఎర్రగా మారుతుంది. కంట్లో పడితే కళ్లు ఎర్రగా అవడంతో పాటుగా దురద కూడా పెడుతుంది. అంతేకాకుండా ఈ రంగును దుస్తులకు, ఒంటికి వదిలించుకోవడం చాలా కష్టం. హోలీ రంగులు ముఖానికి, చేతులకు, కాళ్లకు, దుస్తులకు ఎక్కువగా ఉంటుంటాయి. వీటిని పోగొట్టడానికి చాలా ఓపిక అవసరం. అయినా అక్కడక్కడ హోలీ కలర్స్ కనిపిస్తాయి. కానీ మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ తో వీటిని వదిలించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

holi colors 01

ఆయిల్ మసాజ్

హోలీ ఆడిన తర్వాత స్నానం చేయడానికి ముందు శరీరాన్ని నూనెను మసాజ్ చేయండి. ఇది మీ చర్మానికి అంటుకున్న కెమికల్ కలర్స్ ను వదిలించడానికి సహాయపడుతుంది. అంతేకాదు నూనె మసాజ్ వల్ల చర్మం మృదువుగా, రిఫ్రెష్ గా కనిపిస్తుంది. నూనెతో మసాజ్ చేసిన తర్వాత చల్లని నీళ్లతో స్నానం చేయండి. 

Latest Videos


గోరు వెచ్చని నీరు

కొన్ని కొన్ని సార్లు కెమికల్స్ కలర్స్ సాంద్రత వల్ల ఇవి చర్మం నుంచి పూర్తిగా పోవు. అందుకే గోరువెచ్చని నీటితో కలర్స్ ను కడిగేసుకోవాలి. 

సబ్బు 

సబ్బు నీటిలో కాసేపు చర్మాన్ని నానబెడితే కూడా కలర్స్ పూర్తిగా పోతాయి. బాడీ వాష్ లిక్విడ్ వాడితే చాలా తొందరగా కలర్స్ పోతాయి. కానీ మీరు స్క్రబ్బర్ ను అస్సలు ఉపయోగించకూడదు. ఇది మీ చర్మానికి హాని కలిగిస్తుంది.

నిమ్మకాయ, రాతి ఉప్పు

చర్మానికి అంటుకున్న కలర్స్ ను పోగొట్టడానికి మీరు నిమ్మరసం, ఉప్పును కలిపి వాడొచ్చు. దీన్ని చర్మానికి అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో కడిగేయండి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ రసాయన మరకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా, నీరుని కలిపి పేస్ట్ చేయండి. దీన్ని బాగా అంటుకున్న కలర్స్ పై అప్లై చేయండి. దీన్ని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మానికి అంటుకున్న మొండి హోలీ మరకలను పోగొడుతుంది. 

పెరుగు, తేనె

హోలీ రంగులను పోగొట్టడానికి తేనె, పెరుగును కూడా వాడొచ్చు. ఇందుకోసం ఒక కప్పు పెరుగు, మూడు చెంచాల తేనె కలిపి చర్మానికి అప్లై చేసి 15 నిముషాలు అలాగే వదిలేయండి. ఇది హోలీ రంగులను పోగొట్టడంతో పాటుగా మీ చర్మాన్ని అందంగాచేస్తుంది. అయితే ఇందుకోసం మీరు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. 
 

దుస్తులకు హోలీ మరకలను ఎలా తొలగించాలి? 

దుస్తులకు అంటుకున్న కెమికల్స్ రంగుల మరకలను తొలగించడానికి మీరు హోలీ అయిపోయిన వెంటనే వాటిని వాష్ చేయాలి. రెండు రోజుల పాటు దుస్తులను ఉతకకుండా వదిలేస్తే కలర్స్ పోవు. 

చల్లటి నీటితో వాష్ 

హోలీ ఆడిన వెంటనే మీరు స్నానం చేయడంతో పాటుగా చల్లని నీళ్లతో దుస్తులను ఉతుక్కోవాలి. వేడి నీటితో బట్టలను ఉతికితే దుస్తుల నాణ్యత తగ్గుతుంది.

వెనిగర్ లో నానబెట్టండి

దుస్తులను ఉతకడానికి ముందు వెనిగర్ లో రెండు గంటలు నానబెట్టండి. వెనిగర్ కు మరకలను పోగొట్టే గుణం ఉంది. వాషింగ్ మెషీన్ లో స్టెయిన్ రిమూవర్ మోడ్ పెట్టి గంట సేపు బట్టలు ఉతుక్కోవాలి.
 

click me!