స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తారు. నిత్య జీవితంలో ఈ యాప్ అత్యవసర విషయంగా మారిపోయింది. అసలు ఈ యాప్ మెసేజస్ కోసం క్రియేట్ చేశారు. తర్వాత పోటీ కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్లకు దీటుగా అద్భుతమైన ఫీచర్లు యాడ్ చేస్తూ వినియోగదారుల అవసరాలు తీరుస్తోంది. మొదట కేవలం ఎస్ఎంఎస్ ల కోసం దీన్ని రూపొందించినా తర్వాత ఆడియో కాల్స్ చేసుకొనే వీలు కల్పించింది. తర్వాత వీడియో కాల్స్ కూడా సింపుల్ క్లిక్ తో చేసే విధంగా అప్ డేట్ చేశారు. ఇలా ఆడియో స్టేటస్, వీడియో స్టేటస్, వాట్సాప్ గ్రూప్స్, బ్రాడ్ కాస్ట్స్, ఛానల్స్, కమ్యూనిటీస్ ఇలా అనేక అప్ డేట్స్ వచ్చాయి.
వాట్సాప్ ఉపయోగించే వినియోగదారులు మరో కొత్త యాప్ కోసం చూడకుండా అన్ని ఫీచర్లు ఇక్కడే ఉపయోగించుకొనేలా కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. ఇప్పుడు కొత్తగా "కస్టమ్ చాట్ లిస్ట్" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీ కాంటాక్ట్స్ లోని చాట్‌లను వేర్వేరుగా విభజించుకోవచ్చు. రకరకాల చాట్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
WhatsAppలోని కొత్త ఫీచర్ ‘కస్టమ్ చాట్ లిస్ట్’ యూజర్లకు చాటింగ్ చేయడంలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగించి మీరు మీ చాట్‌లను పర్సనల్, ప్రొఫెషనల్, ఫ్యామిలీ వంటి వర్గాలుగా విభజించుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో చాట్‌ల బాక్స్ లను మెయింటెయిన్ చేయడాన్ని సులభం చేస్తుంది.
కస్టమ్ చాట్ లిస్ట్‌ను ఎలా వాడాలో చూద్దాం.
అన్ని చాట్‌లు ఉన్న చోట కొత్త లిస్ట్ క్రియేట్ చేయండి.
సెర్చ్ బార్‌లో ఉన్న "+" బటన్ నొక్కండి.
కొత్త చాట్ లిస్ట్‌కి "ఫ్యామిలీ", "ఆఫీస్", "ఫ్రెండ్స్" లాంటి పేరు పెట్టండి.
ఈ లిస్ట్‌లో ఉండాల్సిన చాట్‌లను సెలెక్ట్ చేయండి. ఒకే లిస్ట్‌లో చాలా చాట్‌లను యాడ్ చేయొచ్చు.
క్రియేట్ చేసిన తర్వాత కూడా చాట్ లిస్ట్ పేరు మార్చొచ్చు.
చాట్ లిస్ట్ పేరుని కొన్ని సెకన్లు నొక్కి ఉంచితే, "రీనేమ్" ఆప్షన్ వస్తుంది.
అదే విధంగా మీకు అవసరం లేదనుకుంటే "డిలీట్" ఆప్షన్ సెలెక్ట్ చేసి చాట్ లిస్ట్‌ను డిలీట్ కూడా చేయొచ్చు.
వాట్సాప్ ఫిల్టర్ బార్‌లో చాట్ లిస్ట్ ఆర్డర్‌ని మార్చొచ్చు.
ప్రతి చాట్ లిస్ట్‌ని టచ్ చేసి, డ్రాగ్ చేసి ఆర్డర్ మార్చొచ్చు. దీని ద్వారా తరచుగా వాడే చాట్‌లను త్వరగా, సులభంగా యాక్సెస్ చేయొచ్చు.
కస్టమ్ చాట్ లిస్ట్ వాడితే వాట్సాప్ చాట్‌లను బాగా మేనేజ్ చేయొచ్చు. చాట్‌లను సులభంగా వర్గీకరించొచ్చు. వేర్వేరు లిస్ట్‌లలోని చాట్‌లను చూడటం సులభం అవుతుంది.