చలికాలంలో పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే వీటిని తినండి..

First Published Jan 13, 2023, 11:48 AM IST

చలికాలంలో పీరియడ్స్ మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహరాలను తింటే పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. అలాగే మొత్తం ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

Image: Getty Images

సరైన ఆహారాన్ని తింటూ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. కీళ్ల నొప్పులు, తలనొప్పి లేదా పీరియడ్ నొప్పి అంటూ ఎలాంటి నొప్పినైనా తగ్గించుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు ఎన్నో అనారోగ్య  సమస్యలను తగ్గిస్తాయి. ఋతుస్రావం సమయంలో తీవ్రమైన అలసట, కడుపు ఉబ్బరం, భరించలేని పొత్తికడుపు నొప్పి, మానసిక స్థితిలో మార్పులు, తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలు రావడం సర్వ సాధారణం. కానీ ఈ నొప్పి కుదురుగా ఉండనీయదు. ఏ పనులను చేయనీయదు. అయితే పీరియడ్స్ సమయంలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల పీరియడ్ నొప్పిని తగ్గించుకోవచ్చు. 

పీరియడ్ నొప్పిని తగ్గించే ఆహారాలు

కొన్ని ఆహారాలు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు భరించలేని పీరియడ్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే చలికాలంలో ఆ తీవ్రమైన తిమ్మిరిని ఎదుర్కోవటానికి ఈ ఆహారాలను తినండి. 

ఆకుకూరలు

చలికాలంలో ఆకుకూరలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో పీరియడ్ నొప్పిని తగ్గించడానికి సహాయపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, బచ్చలికూర వంటి కూరగాయల్లో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి జీవక్రియను పెంచుతాయి. ఇది పీరియడ్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలసటను దూరం చేస్తుంది. 
 


సిట్రస్ పండ్లు

చలికాలంలో సిట్రస్ పండ్లను తప్పకుండా తినాలి. ఇవి తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, పీరియడ్ నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. నారింజ, ఇండియన్ గూస్బెర్రీ లేదా ఉసిరి వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. అలాగే శరీరాన్ని బలంగా చేస్తుంది. ఉదయం లేదా మధ్యాహ్న అల్పాహారంగా నారింజను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్, జామ, స్ట్రాబెర్రీ వంటి ఇతర శీతాకాల పండ్లు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
 

Image: Getty Images

పసుపు

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. శరీరంలో మంటను తగ్గించడానికి పసుపును ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో వచ్చే భరించలేని నొప్పిని తగ్గించడానికి పసుపు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పసుపు వేర్లు లేదా పసుపు పాలను తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది.
 

అల్లం టీ

అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.  ముఖ్యంగా దీన్ని చలికాలంలో కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే అల్లం మన శరీరాల్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందుకోసం ఒక కప్పు అల్లం టీ ని తాగండి. అల్లం శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. అలాగే దానిలోని శోథ నిరోధక లక్షణాలు పీరియడ్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. పిప్పరమింట్ టీ, చామంతి టీ వంటి ఇతర మూలికా టీలు లు కూడా కూడా గొప్ప నొప్పి నివారణలుగా పనిచేస్తాయి.
 

వేడి డార్క్ చాక్లెట్ పానీయం

ఒక గ్లాసు వేడి వేడి డార్క్ చాక్లెట్ పానీయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. డార్క్ చాక్లెట్ పానీయం తీసుకోవడం వల్ల మీ రుతుస్రావం నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాదు.. మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్లో ఐరన్, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుతుచక్ర సమయంలో శరీరాన్ని శక్తివంతంగా చేస్తాయి. 

black raisins

జీడిపప్పు, నల్ల ఎండుద్రాక్ష

నల్ల ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటి కొన్ని డ్రై ఫ్రూట్స్, గింజలను రోజూ గుప్పెడు తినండి. ఎందుకంటే ఇవి పీరియడ్ నొప్పిని తగ్గిస్తాయి. నల్ల ఎండుద్రాక్ష రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. మరోవైపు జీడిపప్పు కటి ప్రాంతాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జీడిపప్పులో ఉండే టోకోఫెరోల్ అనే భాగం రుతుచక్రాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

click me!