ఆయుర్వేదం ప్రకారం, డయాబెటిక్ రోగులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా వేపుడు పదార్థాలు, తియ్యటి పండ్లు తినకూడదు. మామిడి, అరటి, ద్రాక్ష, ఇతర తీపి పండ్లకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో షుగర్ లెవెల్ స్పైక్‌కి కారణమవుతాయి.
ఆయుర్వేదం ప్రకారం, ఉసిరికాయ మధుమేహం స్థాయిని నిర్వహించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 1 టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటితో తీసుకోండి. రోజూ అల్పాహారం తర్వాత దీన్ని తినండి. రక్తంలో చక్కెర స్థాయి బాగానే ఉంటుంది. ఇది కాకుండా, ఖచ్చితంగా నల్ల శనగలు , తృణధాన్యాలు తినండి. ఈ జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటిస్తే.... షుగర్ ని కచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు.
.