Health Tips: వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

First Published Jun 28, 2022, 12:01 PM IST

Health Tips: వర్షాకాలంలో అనేక అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మలేరియా, డయేరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 

Health Tips: వర్షాకాలంలో ఎన్నో రకాల రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ లో దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల ఏ మాత్రం మురికిగా ఉన్నా.. క్రిమి కీటకాలు చేరి ఎన్నో రోగాలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. 

అలాగే ఇన్ఫెక్షన్స్ దగ్గు, జలుబు, జ్వరం వంటివి కూడా ఎక్కువగా వస్తాయి. వీటికి తోడు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, అజీర్థి, కడుపు ఉబ్బరం వంటి ఎన్నో సమస్యలు చుట్టుముడుతాయి. ముఖ్యంగా వర్షంలో తరచుగా తడవడం వల్ల కూడా ఎన్నో రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం  పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.  ఈ కాలంలో రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. బలమైన ఆహారంల తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. 
 

చలువ చేస్తుందని పెరుగును పూర్తిగా మానేయడం మంచిది కాదు. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజూ మధ్యాహ్నం సమయంలో కప్పు పెరుగును తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే పెరుగులో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. 


ఇక ఈ వానాకాలంలో ఆకుకూరలను తినడం పూర్తిగా మానుకోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటికి ఎన్నో క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. తిన్నా పరిమితిలోనే తినేలా ప్లాన్ చేసుకోండి. 

ఇక హెవీ ఫుడ్స్ జోలికి పోకుండా పొట్టకు మేలు చేస్తే, తొందరగా అరిగే తేలికపాటి ఆహారాలనే ఎక్కువగా తింటూ ఉండండి

పచ్చిగా కూరగాయలను తినకండి. ఉడికించి లేదా కాల్చి మాత్రమే తినండి. పచ్చిగా తింటే వాటిపై ఉండే బ్యాక్టిరియా, వైరస్ లు మన శరీరంలోకి వెళ్లి ఎన్నో రోగాలను పుట్టిస్తాయి. 

ఇక ముఖ్యమైన విషయం ఏమింటంటే.. ఈ సీజన్ లో నీటిని ఎట్టి పరిస్థిలో వేడి చేయకుండా తాగకూడదు. అలా తాగితే సర్వ రోగాలు మీకు చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నీటిలో ఎన్నో క్రిమికీటకాలు, వైరస్ లు, సూక్ష్మజీవులు ఉంటాయి. 

ఈ సీజన్ లో  సీ ఫుడ్స్ అయిన చేపలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే డయేరియా, కలరా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్లు తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు నడవాలి. లేదంటే జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
 

ఈ కాలంలో చల్ల నీటితో కాకుండా గోరు వెచ్చని, వేడి నీళ్లతో రోజుకు రెండు సార్లు స్నానం చేస్తే మంచిది. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన క్రిమికీటకాలు తొలగిపోతాయి. చర్మ సమస్యలు రావు. అలర్జీ వచ్చే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా వర్షం కారణంగా బయట వాతావరణం కలుషితమవుతుంది. అందుకే స్ట్రీట్ ఫుడ్ ను తినకండి.  

click me!