మొక్కల ఆధారిత ఆహారం ఒక్క ఊబకాయాన్నే కాదు ఎన్నో రోగాలను తగ్గిస్తుంది..

First Published Jan 10, 2023, 10:05 AM IST

మొక్కల ఆధారిత ఆహారంలో స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అంతేకాదు ఇవి ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడతాయి. 
 

ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం 1975 నుంచి ఇది దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2016 డేటా ప్రకారం.. 1.9 బిలియన్ల మంది పెద్దలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయానికి దారితీసే ప్రధాన కారకం. 

మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటిస్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)  వంటి సమస్యలు ఎక్కువగా ఊబకాయులకు, అధిక బరువు ఉన్నవారికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేసిన తృణధాన్యాలు, సోడియం, చక్కెర, సంతృప్త కొవ్వు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్ లు అధికంగా ఉండే క్యాలరీల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం.. కూరగాయలు, పండ్లు, ఫైబర్, కాయలు, విత్తనాలను తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ స్థాయిలు తగ్గడం వంటి జీవన శైలిలోని మార్పుల వల్ల ఊబకాయం బారిన పడతారు. 

పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఇతర మొక్కల ఆహారాలతో పాటు ఐసిఎంఆర్ సిఫారసు చేసిన విధంగా 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే వ్యాధుల  ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటూ.. అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలను, ఎర్ర మాంసాల వినియోగాలను తగ్గించడం వల్ల ఊబకాయంతో పాటుగా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. మొక్కల ఆహారాల ఆధారిత ఆహారంలో ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి ప్రారంభాన్ని, పురోగతి నుంచి మనల్ని రక్షిస్తాయి. మొక్కల ఆహారాల్లో ప్రయోజనకరమైన ఫైటోస్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

పాలీఫెనాల్స్ మొక్కల నుంచి ఉత్పన్నమైన క్రియాత్మక భాగాల సమూహం. వాటి వివిధ నిర్మాణాల ఆధారంగా లిగ్నన్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లుగా వర్గీకరించబడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగుతున్న ఎన్సిడీలను నివారించడానికి ఎంతో  సహాయపడతాయి. 

ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.గట్ ఆరోగ్యంతో పాటుగా మన మొత్తం ఆరోగ్యాన్ని నిర్వహించే సంభావ్య ప్రీబయోటిక్స్ వీటిలో ఉంటాయి.  కార్బోహైడ్రేట్లు (సిహెచ్ఓ) శక్తికి ప్రధాన వనరు. మొక్కల ఆధారిత ఆహారం ఫైబర్ కు మంచి మూలం. కరిగే, కరగని ఫైబర్ వ్యాధి నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, గోధుమలు, ఓట్స్, బార్లీ, క్వినోవా, మొక్కజొన్న, చిరుధాన్యాలు వంటి తృణధాన్యాలనుు మీ ఆహారంలో చేర్చుకోండి. ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

diet

చిరుధాన్యాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గ్లూటెన్ లేనివి. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లను, ఖనిజాలను, విటమిన్లను కలిగి ఉంటాయి. గోధుమలు, బియ్యంతో పోలిస్తే  వీటిలో తక్కువ మొత్తలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. జొన్న,పెరల్ మిల్లెట్, రాగులు కొన్ని ముఖ్యమైన చిరుధాన్యాలు. ఇవి ఫైబర్ కు మంచి మూలం. వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్లు, ఖనిజాలు, ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రీబయోటిక్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. 

hepatities


మన శరీరంలో ప్రోటీన్లు ఎన్నో విధులను నిర్వర్తిస్తాయి. ఐసిఎంఆర్ సిఫారసుల ప్రకారం.. శరీర బరువు కిలోకు 0.6 నుంచి 0.83 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాలి. శాఖాహార ప్రోటీన్ వనరులైన పప్పుధాన్యాలు, బీన్స్, సోయా, పాలు, పాల ఉత్పత్తులు, గింజలు, విత్తనాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, నూనెలు సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇవి కొవ్వులో కరిగే విటమిన్ల శోషణకు సహాయపడతాయి. విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు మీ ఆహారంలో  పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. శక్తి అవసరాన్ని బట్టి రోజుకు 25 నుంచి 40 గ్రాముల (5-6 టీస్పూన్లు) నూనెలు, నెయ్యి, వెన్న కొవ్వులను తీసుకోవాల్సి ఉంటుంది. 

click me!