శ్రీరెడ్డి బట్టలు విప్పడానికి టీవీ 5 మూర్తికి సంబంధం ఏమిటీ... ఏళ్ల తర్వాత వెలుగులోకి అసలు నిజం!

First Published May 1, 2024, 7:02 AM IST

నటి శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చేసిన అర్థనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా సంచలనం కాగా, దీని వెనుక టీవీ 5 మూర్తి ఉన్నాడనే వాదన ఉంది. ఈ వివాదంపై స్పందించిన టీవీ 5 మూర్తి కీలక విషయాలు బయటపెట్టారు. 
 

తెలుగు అమ్మాయి అయిన శ్రీరెడ్డి టాలీవుడ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అవకాశాలు ఇప్పిస్తామని తనను పలువురు లైంగికంగా వాడుకున్నారని శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో చిత్ర ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు, సోషల్ మీడియా చాటింగ్స్ ఆమె బయటపెట్టారు. 

శ్రీరెడ్డిని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బ్యాన్ చేసింది. 2018 ఏప్రిల్ లో ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. లైంగిక వేధింపులు, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకపోవడానికి వ్యతిరేకంగా శ్రీరెడ్డి తన పై వస్త్రాలు తొలగించారు. 

అయితే శ్రీరెడ్డి ఇలా నిరసన చేయడం వెనుక జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి ఉన్నాడనే వాదన గట్టిగా వినిపించింది. శ్రీరెడ్డిని టీవీ 5 మూర్తి డిబేట్లల్లో కూర్చోబెట్టి ఆమెకు మద్దతు తెలిపారు. వరుస ఈవెంట్స్ నిర్వహించాడు. అలాగే శ్రీరెడ్డికి డబ్బులిచ్చి మరీ టీవీ 5 మూర్తి ఇలా చేయించాడని కథనాలు వెలువడ్డాయి. 
 

ఈ ఆరోపణల మీద టీవీ 5 మూర్తి స్పందించాడు. ప్రతినిధి 2 చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న టీవీ 5 మూర్తి.. తాను శ్రీరెడ్డికి డబ్బులిచ్చి నిరసనలు చేయించాను అనడంలో నిజం లేదన్నారు. అది జరిగినప్పుడు కనీసం నేను ఊళ్ళో కూడా లేనని టీవీ 5 మూర్తి చెప్పుకొచ్చాడు. 
 

టీవీ 5 మూర్తి మాట్లాడుతూ.. నేను ఎవరికీ డబ్బులు ఇవ్వను, మరొకరి దగ్గర డబ్బులు తీసుకోను. శ్రీరెడ్డి ఆ పని చేయడానికి రెండు రోజుల ముందు మా స్టూడియోకి వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటుంటే... నేను, కరాటే కళ్యాణి మందలించాము. 
 

శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేసినప్పుడు నేను హైదరాబాద్ లో లేను. మా అమ్మకు బాగోకపోతే ఊరు వెళ్ళాను. హాస్పిటల్ లో రెండు రోజులు ఉండి వచ్చాను. తిరిగి వచ్చాక అంతా నేనే చేయించాను అని అన్నారు. అవకాశాలు ఇప్పిస్తామని ఒక అమ్మాయిని లైంగికంగా వాడుకోవడం తప్పు. ఈ విషయంలో నేను శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చాడు.

శ్రీరెడ్డి నిరసన చేస్తున్న కారణానికి నేను మద్దతు తెలిపాను. శ్రీరెడ్డి కి కాదు. ఇప్పటికీ నేను అదే మాటకు కట్టుబడి ఉన్నాను, అని టీవీ 5 మూర్తి అన్నారు. ఇక దర్శకుడిగా మారిన టీవీ 5 మూర్తి నారా రోహిత్ హీరోగా ప్రతినిధి 2 తీశాడు. ఇది వై ఎస్ జగన్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా అని తెలుస్తుంది...

click me!